twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దక్షిణాది వారంటే ఎందుకు వివక్ష.. చిన్నచూపు.. ప్రధాని మోదీపై ఉపాసన కొణిదెల విసుర్లు

    |

    Recommended Video

    Upasana Konidela Viral Tweet On PM Narendra Modi || ఉపాసన వాదన పై మీ OPINION ఏంటి ?

    మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా దేశంలోని ప్రముఖ సినీ తారలతో ప్రధాని నరేంద్రమోదీ శనివారం రాత్రి ఢిల్లీలో కలుసుకొన్నారు. ఈ కలయికలో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, కంగన రనౌత్, సోనమ్ కపూర్ తదితరులు హాజరయ్యాురు. ఈ సమావేశం ప్రధాని అధికారిక నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో టెలివిజన్, సినిమా తారలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. అయితే దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన వారెవర్ని పిలువకపోవడంపై మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ఉపాసన ఏమన్నారంటే..

    మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా

    మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా

    బాపూజీ 150వ జయంతి సందర్భంగా సినీ తారలను ఆహ్వానించి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహాత్ముడి విలువలను, శాంతి సందేశాన్ని వినోద మాధ్యమం ద్వారా మరింత ప్రచారం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దర్శకుడుల రాజ్ కుమార్ హిరానీ, రాజ్ కుమార్ సంతోష్, అశ్వినీ అయ్యర్ తివారీ, ఏక్తా కపూర్, బోనీ కపూర్, జయంతిలాల్ తదితరులు పాల్గొన్నారు.

    తప్పు పట్టిన ఉపాసన కొణిదెల

    తప్పు పట్టిన ఉపాసన కొణిదెల

    అయితే దక్షిణాది సినీ తారలను ఆహ్వానించకపోవడంపై హీరో రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల ట్విట్టర్‌లో తప్పుపట్టారు. తెలుగు, ఇతర పరిశ్రమల ప్రముఖులను పిలువకపోవడంపై తనలోని బాధను, భావోద్వేగాన్ని ట్విట్టర్‌లో వినిపించారు. ప్రస్తుతం ఉపాసన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    ప్రియమైన మోదీ గారికి

    ప్రియమైన మోదీ గారికి

    ప్రియమైన నరేంద్రమోదీ గారు. మిమ్మల్ని దక్షిణాది ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారు. మీలాంటి ప్రధాని ఉండటం గర్వంగా భావిస్తాం. ఆ గౌరవం అలానే కొనసాగుతుంటుంది. కానీ మీరు నిర్వహించిన సమావేశానికి కొంతమంది హిందీ తారలనే పిలిచి.. దక్షిణాది సినీ ప్రముఖులను ఆహ్వానించకుండా నిర్లక్ష్యం చేశారనే ఫీలింగ్ కలిగింది అని ఉపాసన ట్వీట్ చేశారు.

    దక్షిణాది వారిని పిలువకపోవడంపై

    దక్షిణాది వారిని పిలువకపోవడంపై

    ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి దక్షిణాది తారలను పిలువకుండా హిందీ సినిమా ప్రముఖులనే పిలవడం నాకు చాలా బాధ కలిగించింది. దక్షిణాది తారలను నిర్లక్ష్యం చేశారనే నా బాధను ఇలా తెలియజేయాలని అనుకొన్నాను. కాబట్టి మీరు సరైన రీతిలో నా బాధను అర్ధం చేసుకొంటారనుకొంటాను అని ఉపాసన ట్వీట్‌లో పేర్కొన్నారు. చివరకు జై హింద్.. నరేంద్రమోదీ జీ అంటూ ట్వీట్‌ను ముగించారు.

    దిల్ రాజు హాజరు

    దిల్ రాజు హాజరు

    ఎప్పటి నుంచో దక్షిణాది, ఉత్తరాది ప్రాంతాల మధ్య వివక్ష కొనసాగుతుందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ప్రధాని సమావేశం దానికి బలం కల్పించిందనే విషయం ఉపాసన ట్వీట్ ద్వారా మరోసారి స్పష్టమైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వారిని ఈ సమావేశానికి ఆహ్వానించారా? లేదా అనేది త్వరలోనే స్పష్టం కానున్నది. కాగా ప్రధాని మోదీని కలుసుకొన్న వారిలో తెలుగు పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఉండటం గమనార్హం.

    అమీర్ ఖాన్ ట్వీట్

    అమీర్ ఖాన్ ట్వీట్

    కాగా ప్రధాని మోదీతో సమావేశం అనంతరం పలువురు సినీ తారలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. అమీర్ ఖాన్ ఈ సందర్భంగా స్పందిస్తూ.. ప్రధానితో వండర్‌ఫుల్ ఇంటారక్షన్ జరిగింది. అతని అద్భుతమైన విజన్‌‌ను విని స్ఫూర్తి పొందాం. ఈ కలయిక ఓ మధురానుభూతిని పంచింది అని అన్నారు.

    English summary
    Bollywood stars met Narendra Modi: Actor Ram Charan wife Upasana Konidela blasts Narendra Modi for not inviting South star for his meeting. She tweeted that Dear Narendra Modi Ji. We in the south of India admire you and are proud to have you as our prime minister. With all due respect we felt that the representation of leading personalities was limited to only Hindi Artists. and South industry completely neglected. I express my feelings with pain and hope it's taken in the right spirit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X