Don't Miss!
- News మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
- Finance Gold Rate: రంకెలు వేస్తున్న బంగారం ధరలు.. నేడు రూ.3,800 పెరగటంతో..
- Automobiles బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- Sports Hardik Pandya: కెప్టెన్గా చెత్త రికార్డు సాధించా.. హ్యాపీనే!
- Lifestyle ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
వివిధ నేరాల్లో జైలుకెళ్లిన సినీతారలు వీరే (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: సాధారణ వ్యక్తులు తప్పులు చేసి జైలు కెళ్లితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు కానీ.... సెలబ్రిటీల, ముఖ్యంగా ప్రజా జీవితంలో ముడి పడి ఉండే సినీ తారలు, రాజకీయ నాయకులు జైలు కెళితే మాత్రం అదో సెన్సేషనే. తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటం బాలీవుడ్ మొత్తాన్ని షాక్కు గురి చేసింది.
సంజయ్ దత్ మాత్రమేకాదు... గతంలో చాలా మంది స్టార్స్ వివిధ నేరాల్లో కటకటాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. కొందరు నేర ఆరోపణలపై, మరికొందరు నేరాలు రుజువై జైలుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, షైనీ ఆహుజా, మాధుర్ బండార్కర్, జాన్ అబ్రహం, ఫరీద్ ఖాన్, మోనికా బేడీ, మధుబాల తదితరులు ఉన్నారు.
కారణం ఏదైనా.... వెండి తెరపై వివిధ పాత్రలు పోషించి, అనేక రకాలుగా ఎంటైర్ చేసి తమ అభిమాన్ని చూరగొన్న సినీతారలు జైలు కెళ్లడం అంటే అభిమానులను కాస్త బాధించే అంశమే. కానీ చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు కదా! తప్పు ఎవరు చేసినా తప్పే....
సినీ తారలు జైలుకెళ్లిన కారణాలపై ఓ లుక్కేద్దాం...
బాలీవుడ్ మోస్ట్ పవర్ ఫుల్ స్టార్స్ లో సల్మాన్ ఒకరు. అప్పట్లో జింకలను వేటాడిన కేసులో సల్మాన్ కొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది. మరోసారి ఫుట్ పాత్పై నిద్రిస్తున్న వారిపై వాహనం నడిపి జైలు గడపతొక్కాడు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఐదేళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. ఇప్పటికే 18 నెలల జైలు జీవితం గడిపాడు. మరికొన్ని రోజుల్లో మిగిలిన శిక్ష అనుభవించేందుకు జైలు వెళ్లబోతున్నాడు.
నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని తాజ్ హోటల్ లో ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో అరెస్టయ్యారు. కొన్ని గంటలు జైల్లో గడిపి అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు.
మరో బాలీవుడ్ నటుడు షైనీ ఆహుజా పని మనిషిని రేప్ చేసిన కేసులో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత ఆమె కేసు విత్ డ్రా చేసుకోవడంతో విడుదలయ్యారు.
అండర్ వరల్డ్ డాన్ అబూ సలెం గర్ల్ ఫ్రెండ్ మోనికా బేడీ పాస్ పోర్ట్ ఫోర్జరీ కేసులో జైలు కెళ్లారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలవడంతో పాటు బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంటున్నారు.
మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు మధుర్ బండార్కర్ 2006లో రేప్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి తనను లైంగికంగా అనుభవించాడని ప్రతి జైన్ ఆయనపై కోర్టు కెక్కింది. అయితే ఆరోపణలు రుజువు కాక పోవడంతో అతనికి ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది.
పాత తరం బాలీవుడ్ నటి మధు బాల కూడా జైలు గడప తొక్కారు. దర్శకుడు బిఆర్. చోప్రా నుంచి అడ్వాన్స్ తీసుకుని కూడా నటించడానికి నిరాకరించడంతో జైలు కెళ్లాల్సి వచ్చింది.
బైకు రైడింగ్ అంటే తెగ మోజు పడే బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం...అతి వేగంగా తన స్పోర్ట్స్ బైక్ నడుపుతూ ఇద్దరిని గాయ పరిచారు. ఈ కేసులో జాన్ 15రోజులు జైల్లో గడిపాడు.
మరో బాలీవుడ్ నటుడు పరీద్ ఖాన్ కొకైన్ తీసుకున్న కేసులో 2001లో ఆయన్ని అరెస్ట్ చేసారు.