ఢిల్లీలో రాంచరణ్, అలియా రొమాన్స్.. RRR‌లో అఫీషియల్‌గా

Recommended Video

Alia Bhatt Will Join SS Rajamouli's RRR In Delhi Next Week | Filmibeat Telugu

బాహుబలి తర్వాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR చిత్రం షూటింగ్ పరంగా శరవేగంగా ముందుకెళ్తున్నది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. షూటింగ్ దశలోనే అనేక సంచలనాలకు వేదికగా మారుతున్నది. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను రాజమౌళి వెల్లడించిన తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వార్త మీడియాలో వెలుగు చూసింది. అదేమిటంటే..

రామరాజుకు చేరువగా సీత

రామరాజుకు చేరువగా సీత

RRR సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా ప్రత్యేక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రామరాజు ప్రేయసిగా సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ మెరిసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వచ్చేవారం ఢిల్లీలో ప్రారంభం కానున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

రాంచరణ్, అలియాపై కీలక సీన్లు

రాంచరణ్, అలియాపై కీలక సీన్లు

చిత్ర యూనిట్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరిగే మూడో షెడ్యూల్ కోసం అలియాభట్ సిద్ధం అవుతున్నారు. RRR యూనిట్‌లో అలియాభట్ భాగమవుతారు. ఈ షెడ్యూల్‌లో రాంచరణ్, అలియాభట్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. వీటితోపాటు యుద్ద పోరాటాలు, యాక్షన్ సీన్లను రియల్ లొకేషన్లలో చిత్రీకరిస్తారు అని వెల్లడించారు.

 రాంచరణ్ కెరీర్‌లోనే టాప్

రాంచరణ్ కెరీర్‌లోనే టాప్

ఢిల్లీ షెడ్యూల్ ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్ అల్యుమినియం ఫ్యాక్టరీలో వేసిన జైల్ సెట్‌లో మరికొన్ని సీన్లను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారట. తొలి, రెండో షెడ్యూల్‌లో రాంచరణ్‌పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రాంచరణ్ కెరీర్‌లోనే లార్జర్ దేన్ లైఫ్‌గా మిగిలిపోయే విధంగా సీన్లు వచ్చాయనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

 నాలుగో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో

నాలుగో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో

నాలుగో షెడ్యూల్‌ను కూడా జైలు సెట్‌లోనే చిత్రీకరించే అవకాశం ఉందట. అలాగే అల్యుమినియం ఫ్యాక్టరీలో మరికొన్ని సన్నివేశాలు షూట్ చేయడానికి ప్లాన్ చేశారని తెలిసింది. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో రూపొందుతున్న RRR చిత్రం జూలై 20, 2020లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X