హత్యాయత్నం కేసులో సినీ ఫైట్ మాస్టర్ అరెస్ట్

టిను వర్మను గురువారం తెల్లవారు ఝామున 3 గంటలకు అరెస్టు చేసినట్లు కురర్ పోలీస్ స్టేషన్ సినీయర్ ఇన్స్‌స్పెక్టర్ ఎస్.డి. డఫ్లె తెలిపారు. టినూ వర్మ మరియు అతని సవతి సోదరుడు మనోహర్ గుర్గావ్‌లోని ఫాంహౌస్ విషయంలో గొడవ పడుతున్నారని, ఈ క్రమంలో టినూ వర్మ కత్తితో మనోహర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, ఈ దాడిలో మనోమర్ కాలికి గాయం అయినట్లు పోలీసులు తెలిపారు.
దాడి జరిగిన వెంటనే మనోహర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో టినుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అతనిపై ఐపిసి సెక్షన్ 307(హత్యాయత్నం), 452 మరియు ఆర్మ్ యాక్ట్ 4, 25 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కురర్ పోలీసులు తెలిపారు. టినూ వర్మ అరెస్టు బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది.
అయితే టినూ వర్మ వాదన మరోలా ఉందని తెలుస్తోంది. అతనికి సంబంధించిన ఏరియాను మనోహర్ ఆక్రమించుకున్నట్లు సమాచారం. ఈక్రమంలో కోపోద్రిక్తుడైన టినూ వర్మ మనోహర్‌పై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











