సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మృతి
1942 డిసెంబర్ 29న అమృత్‌సర్‌లో జన్మించిన రాజేష్ ఖన్నా అసలు పేరు జతిన్ ఖన్నా. 1966లో Aakhri Khat అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఇప్పటి వరకు 163 బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. ఉత్తమ హీరోగా 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1969 నుంచి 1972 మధ్యకాలంలో ఒకదాని తర్వాత మరొకటిగా 15 సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 'ఆరాధన', హాథీ మేరే సాథీ', 'ఆనంద్', 'అమర్ ప్రేమ్' వంటి చిత్రాలు ఖన్నా నట జీవితంలో గొప్ప మైలురాళ్లుగా మిగిలిపోతాయి. 1991 నుంచి 1996 వరకు ఎంపీగా పని చేశారు. నటుడుగానే కాకుండా నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. రాజేష్ ఖన్నాను ముద్దుగా అందరూ కాకా అంటారు.
1973లో డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్న ఖన్నా 1984లో ఆమె నుంచి విడిపోయాడు. ప్రస్తుతం వీరు విడివిడిగా జీవిస్తున్నప్పటికీ, విడాకులు తీసుకోలేదు. పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా కొంత కాలం సినిమాల్లో నటించిన అనంతరం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‍ను పెళ్లాడింది. రెండో కూతురు రింకీ ఖన్నా కూడా ఒకటిరెండు సినిమాల్లో నటించింది. తర్వాత ఆమె లండన్‌లోని ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడింది. ఖన్నాతో విడిపోయినప్పటికీ డింపుల్ కపాడియా కొంత కాలంగా ఆయన వెంటేవుండి సపర్యలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications












