Kumar Sahani No More: బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సహానీ కన్నుమూత.. ఎలా చనిపోయారంటే?

గత కొంతకాలంగా దేశంలోని అన్ని సినీ రంగాల్లో వరుసగా విషాధాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఒక్కొక్కరినీ ఒక్కో మృత్యువు కబళిస్తోంది. ముఖ్యంగా ఈ రెండు మూడు నెలల వ్యవధిలోనే అనేక మంది సెలబ్రిటీలు ప్రాణాలు కోల్పోయారు. టాప్ టెక్నీషియన్లు, డైరెక్టర్లు, నిర్మాతలు ఇలా ఈ చిత్ర రంగంలో సంబంధం ఉన్న అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా మరో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరెవరో కాదు కుమార్ సహానీ. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హిందీ చిత్ర సీమకు ఎన్నో హిట్ సినిమాలు అందించిన కుమార్ సహానీ.. 1965లో సినీ రంగంలో అడుగు పెట్టారు. ముఖ్యంగా మాయా దర్పణ్, తరంగ్, కాయల్ గత, కబ్సా, చర్ అద్యాయ్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. అతి తక్కువ కాలంలోనే ఆయన టాలెంట్ ప్రూవ్ చేసుకుని బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఛాన్స్ కొట్టేశారు. అయితే ప్రస్తుతం 83 ఏళ్ల వయసు కల్గిన ఈయన వయసురీత్యా అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు.

Bollywood Top Director Kumar Sahani Passed Away Check Details

చాలా కాలంగా వృద్ధాప్య కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతుండగా.. శనివారం ఆయన పరిస్థితి మరింత క్షీణించింది. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.

అయితే కుమార్ సహానీ మృతి విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ట్వీట్లు చేస్తున్నారు. 1940 వ సంవత్సరంలో డిసెంబర్ 7వ తేదీన సింధ్ లోని లర్మానాలో పుట్టిన కుమార్ సహానీ.. ఆ తర్వాత ముంబైకు వచ్చేశారు. అక్కడే చదువుకున్నారు. ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ చేసి ఆ తర్వాత స్కీన్ రైటర్ గా, డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్ సినిమాలు తీస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసి టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా వయసు పెరుగుదల రీత్యా వచ్చిన సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X