సినీ ఇండస్ట్రీలో వరుస విషాధాలు.. ఆ టాప్ డైరెక్టర్ ఇక లేరు!
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుసగా విషాధాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనేక మంది సినీ రంగంలోని ప్రముఖులు ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది ప్రారంభంలోనే సీనియర్ రెబల్ నటుడు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ యాక్టర్, కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ వంటి దిగ్గజ నటులు నింగికెగిరారు. ఇక వారం రోజుల క్రితమే సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు. ఇలా సీనియర్ టాప్ మోస్ట్ నటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చనిపోతుండగా.. తాజాగా మరో టాప్ డైరెక్టర్ మృతి చెందారు. ఆయన ఎవరు, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంజయ్ గాధ్వి గురించి అందరికీ తెలిసిందే. ఈయన పేరు కంటే కూడా ధూమ్ సినిమా డైరెక్టర్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఇట్టే గుర్తుపడతారు. అయితే ధూమ్, ధూమ్ 2 వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాలను తెరకెక్కించిన ఆ దర్శకుడు తాజాగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 56 ఏళ్ల వయసు కల్గిన ఆయన ముంబయిలోని తన నివాసంలోనే ఆదివారం రోజు ఉదయం చనిపోయారు. ఇదే విషయాన్ని ఆయన పెద్ద కుమార్తె సంజినా అధికారికంగా ప్రకటించారు.

అయితే అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఓ టాప్ డైరెక్టర్ ఇకలేరని తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సంజయ్ గాధ్వి లేని లోటు బాలీవుడ్ పరిశ్రమకు తీరని లోటని చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఝ సానుభూతి తెలుపుతున్నారు. 2001లో తేరే లియే సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన సంజయ్ గాధ్వి ఆ తర్వాత ఏడాదే మేరే యార్ కి షాదీ హై అనే అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇక ఆ తర్వాత ధఊమ్, ధూమ్ 2, కిడ్నాప్, ఆజబ్ గజబ్ లవ్ వంటి హిట్టు చిత్రాలను కూడా డైరెక్ట్ చేశారు. ఇక ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు ఆయన సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఇటీవల అంటే మూడేళ్ల క్రితమే ఆపరేషన్ పరిండే సినిమాను తెరకెక్కించారు. 56 ఏళ్ల వయసు కల్గిన సంజయ్ గాధ్వికి భార్య గీనాతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే ఈయన మృతి విషయం చెప్పారే తప్ప ఎలా చనిపోయారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











