హిందీలో 'అ అంటే అమలాపురం...'సాంగ్
నసీరుద్దీన్ షా, సోను సూద్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం 'మాగ్జిమమ్'లో ఆ పాటను ఉపయోగించుకొన్నారు. విశేషం ఏమిటంటే పల్లవిలో 'అ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం...' అనే పంక్తుల్ని యథాతథంగా హిందీ గీతంలోనూ ఉపయోగించుకొన్నారు. 'ఇ అంటే ఇండియన్ రిథమ్' అని పాడించారు. ఈ పాటకు హెజెల్ అనే బ్రిటిష్ నటి నర్తించారు. తెలుగులో పాడిన మాలతికే హిందీలోనూ గానం చేసే అవకాశం దక్కింది.
విశేషమేమిటంటే...'రింగ రింగ','అ అంటే అమలాపురం...' రెండు ఐటమ్ సాంగ్స్ కి దేవినే సంగీత దర్సకుడు కావటం. అలాగే ఇప్పుడు గబ్బర్ సింగ్ లోని కెవ్వుకేక పాట కూడా హిందీలో రానున్నదని సమాచారం. సల్మాన్ ఖాన్ రాబోయే చిత్రం దబాంగ్ 2 లో ఈ ఐటం సాంగ్ చోటు చేసుకునే అవకాశం ఉందని ఇప్పటికే బాలీవుడ్ వర్గాల్లో టాక్ మొదలైంది. దాంతో సంగీత దర్శకులు ఈ ఐటం సాంగ్ లకు ఉన్న డిమాండ్ చూసి తమ సినిమాల్లోనూ నేషనల్ లెవిల్ ఐటం సాంగ్ లు పెట్టేసే అవకాశం ఉంది.
ఇక మాగ్జిమమ్ చిత్రం విషయానికి వస్తే..ఈ చిత్రం 2003లో ముంబై నేపధ్యంలో జరుగుతుంది. లాండ్ డీల్స్,పాలిటిక్స్,పోలీసులు మధ్య జరిగే ఇంటిన్స్ డ్రామా. సోనూసూద్,నసీరుద్దీన్ షా ఇద్దరూ పోలీస్ అదికారులుగా కనిపిస్తారు. అర్షాద్ వార్శీ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా చేస్తున్నాడు. ఈ చిత్రం సోనూ సూద్ కి హిందీ పరిశ్రమలో బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












