బాలీవుడ్ స్టార్ హీరో 'జాయ్ ముఖర్జీ' కన్నుమూత
సోమవారం ఈయన ఆరోగ్య పరిస్దితి విషమంగా ఉండడంతో ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేర్పించారు. కానీ అనుకోని పరిస్దితుల వల్ల ఈరోజు ఉదయం 9.30 ఆయన మరణించారు. చనిపోయినప్పుడు ఆయన ప్రక్కనే పిల్లలు, భార్య అందరూ ఉన్నారని ఆయన తరుపున ప్రతినిధి ఆర్ ఆర్ ఫాథక్ తెలిపారు. ఇంకా ముఖర్జీ శ్మశాన స్థలం, సమయం నిర్ణయించ లేదు. కాని ప్రజలు ఇప్పుడిప్పుడే వస్తున్నారని అన్నారు. ఆస్పత్రి ఫార్మాలిటీలు పూర్తి తర్వాత ముఖర్జీ యొక్క శరీరం కొన్ని గంటల్లో తన నివాసాన్ని తీసుకెళ్ళతామని అన్నారు.
1960లో ముఖర్జీ నటించిన చిత్రం "లవ్ ఇన్ సిమ్లా" ఒక్కసారిగా బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేయగా షోబిజ్ లోకి దిగిపోయారు. ఆ తర్వాత ఆయన నటించిన "జిద్ది", "ఫిర్ వహి దిల్ లాయా హూన్" మరియు "ఏక్ ముసాఫిర్ ఏక్ హాసీన్", "టోక్యో లో లవ్", "షాగ్రిడ్" లాంటి సినిమాలు ఒక్కసారిగా ఈయనకు మంచి ప్రజాదరణను తెచ్చిపెట్టాయి.
జాయ్ ముఖర్జీ కూడా సినిమా కుటుంబం నుండే వచ్చారు. బాలీవుడ్ ప్రముఖ లెజెండరీ హీరో అశోక్ కుమార్ చెల్లెలు సతీ దేవి, శాస్ ధార్ ముఖర్జీల కొడుకే ఈ జాయ్ ముఖర్జీ. కాజోల్, తనీషాలకు యొక్క అంకులే మన జాయ్ ముఖర్జీ.


Click it and Unblock the Notifications












