లక్ష మందికి పైగా సినీ కార్మికుల సమ్మె
తమకు తక్కువ వేతనాలు వస్తున్నాయని, పేమెంట్స్ సరిగా ఇవ్వటం లేదని, యూనియన్ మెంబర్స్ కాని వారిని పనిలోకి తీసుకుంటున్నారని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయస్ యూనియన్ (FWICE) ఈ రోజు ఉదయం(అక్టొబర్ 1)నుండి నిరవధిక సమ్మె ని ప్రారంభించింది. ఈ సమ్మెలో దాదాపు లక్షమందికి పైగా సినీ కార్మికులు పాల్గొంటున్నారు.
ఈ సమ్మెలో కెమెరా ఆపరేటర్లు,జూనియర్ ఆర్టిస్ట్స్,లైటింగ్ టెక్నీషియన్స్ వంటి ఇవరై కి పైగా సినీ యూనియన్లు FWICE కి మద్దతిస్తున్నాయి.ఈ సందర్భంగా FWICEయూనియన్ నాయుకుడు దినేష్ చతుర్వేది మాట్లాడుతూ...మేం ఇంతకు ముందు నిర్మాతలతో ఆగస్టులో చర్చలు జరిపాము. ఫలితం లేదు. అందుకే ఈ రోజు ఉదయం నుంచీ మేం సెట్స్ కి పనుల్లోకి పోవటం లేదు. అందుచేత చాలా షూటింగ్ లు ఆగిపోతాయి. 147,000 మంది స్ట్రైక్ లో పాల్గొంటున్నారు.
మంచి వేతనమివ్వాలని అడగటం మా హక్కు గా భావిస్తున్నాం. ఫిల్మ్ వర్కర్ కి రోజుకి ఆరువందలు, టీవీ మీడియాలో పనిచేసే వర్కర్ కి ఐదువందలు వస్తున్నాయి. వాటిని పెంచరు సరికదా ..చివరకు సరైన టైమ్ కి పూర్తి మొత్తం కూడా ఇవ్వటం లేదని ఆవేదన వెళ్ళబుచ్చారు. మా సమ్మెకు సపోర్టుగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమితాబ్,షారూఖ్ ఈ రోజు షూటింగ్లకు వెళ్ళమని హామీ ఇచ్చారు.
ఇప్పటికి నలభైకి పైగా షూటింగ్ లు నిలిచిపోయాయి. ఇక ఈ విషయంపై మోషన్ పిక్చర్స్ మరియు టీవీ పోగ్రామ్స్ నిర్మాతల మండలి అధ్యక్షుడు రతన్ జైన్ స్పందిస్తూ త్వరలోనే సమ్మె ముగియటానికి చర్చలు జరుపుతామన్నారు.


Click it and Unblock the Notifications











