twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ న్యూస్: పవన్ చిత్రం ద్వారా బొమన్ ఇరానీ తెలుగులోకి...

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో ఆయనకీ రోల్ చేస్తున్నారు. త్రీ ఇడియట్స్, మున్నాభాయ్ చిత్రాల ద్వారా స్టార్ గా ఎదిగిన బొమన్ ఇరాని వెర్సటైల్ ఆర్టిస్టు. ఆయన్ను తెలుగులోకి ఓ మంచి పాత్ర ద్వారా పరిచయం చేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో క్షణక్షణం ద్వారా పరేష్ రావెల్ తెలుగులోకి వచ్చినట్లే బొమన్ ఇరాని కూడా ఇలా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా పాపులర్ కానున్నారు.

    ఈ సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రానికి నిర్మాత. జల్సా తరహాలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి. ఈ చిత్రం కామెడీ ప్రధానంగా పంచ్ డైలాగులతో పూర్తి స్తాయి కమర్షియల్ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందట.

    ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగు స్పెయిన్లో ప్లాన్ చేసారు. ఇప్పటికే పవన్, తివిక్రమ్ కలిసి విదేశాల్లో పర్యటించి సినిమాకు కావాల్సిన లొకేషన్లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు దర్శకుడు త్రివిక్రమ్.

    ఈ చిత్రానికి సరదా', 'హరే రామ హరే కృష్ణ' టైటిల్స్ వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ చిత్ర దర్శక నిర్మాతలు టైటిల్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ సంగతి అలా ఉంచితే.... తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రస్తుతం 'తుఫాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఏది ఏమైనా అధికారికంగా ఖరారు అయితే తప్ప దీన్ని నమ్మలేం.

    English summary
    Noted Bollywood actor Boman Irani is all set to make his debut in Telugu soon. He is signed by BVSN Prasad for his latest film in Pawan Kalyan and Trivikram combination. Boman Irani has expressed his happiness over making his Telugu debut with a film starring Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X