Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సూపర్ స్టార్ హీరోకీ డాన్ ఛోటా షకీల్ కీ రిలేషన్ ఏంటి?
సినిమా, మాఫియా రెండూవిడతీయలేని విధంగా కలిసిపోయిన నేపధ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, చోటా షకీల్ రీసెంట్ గా హాట్ టాపిక్ గా మారారు. దానికి కారణం షారూఖ్ ఖాన్ కమిటవనున్న ఓ యాడ్ ఫిల్మ్ కి సంభందించిన ప్రొడక్టు ఓనర్ ని ఛోటా షకీల్ చంపబోతున్నాడనే టాపిక్ రావటమే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బెర్లిన్ లో 'డాన్ 2' సెట్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన 45వ పుట్టినరోజు వేడుకను తన కుటుంబం, సన్నిహితులతో ఘనంగా జరుపుకున్నారు. అయితే అదే సమయంలో ముంబాయిలోని అతని భవనం మన్నత్ వద్ద పరిస్థితి మాత్రం నాటకీయంగా మారింది.
మన్నత్‌కు విచ్చేసేవారిలో ఒకరిపై దాడి జరగబోతోందని పోలీసులకు సమాచారం అందడమే అందుకు కారణం. షారుఖ్ పుట్టినరోజైన బుధవారం నాడు ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి మన్నత్ వద్ద గుట్కా వ్యాపారి జోషి హత్యకు గురికాబోతున్నాడని, పేరుమోసిన మాఫియా డాన్ ఛోటా షకీల్ ఈ హత్యకు కుట్ర పన్నాడని చెప్పడంతో హడావుడి మొదలైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, షారుఖ్ ఖాన్ ఇంటి పరిసర ప్రాంతాలను దిగ్బంధం చేశారు.
షారూఖ్ కి కు పంపిన బహుమతులు, పుష్ప గుచ్ఛాలలో పేలుడు పదార్థాలు ఉన్నాయేమో పరిశీలించారు. అపరిచితులనుంచి ఎటువంటి బహుమతులు అందుకోవద్దని మన్నత్ సిబ్బందిని పోలీసులు ముందుగానే హెచ్చరించారు. షారుఖ్‌తో జోషికి గల సంబంధాల గురించి ఆరా తీశారు. అయితే జోషిని చంపడానికి ఛోటా షకీల్ కుట్ర పన్నడాన్ని అంతగా నమ్మకపోయినప్పటికీ, మన్నత్ వద్ద ఈ దాడి జరగబోతోందన్న సమాచారాన్ని అంత తేలికగా కొట్టి పారేయలేకపోయామని పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు చెప్పారు. ఇది ఇలా ఉండగా, కొన్ని వ్యాపార ప్రతిపాదనలపై షారుఖ్ ఖాన్‌తో జోషి ఇటీవల మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.