Don't Miss!
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- News జగన్ Vs పవన్, సమర్ధతకు పరీక్ష - దక్కేదెవరికి..!!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఆ సీన్ 'పీక్స్': 'నా పేరు సూర్య'లో బన్నీ బ్లాస్ అయ్యాడంతే?..
Recommended Video
బన్నీ కెరీర్ లోనే హైఓల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ ఇంపాక్ట్ తోనే తన టెంపర్ ఏంటో చూపించిన ఈ సూర్య.. సినిమాలో ఇంకెంత అగ్రెసివ్‌గా కనిపిస్తాడోనన్న ఆసక్తి నెలకొంది. డైరెక్షన్ మొదటిసారే అయినా.. వక్కంతం వంశీ ట్రీట్ మెంట్ కూడా బాగా పేలినట్టే కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పటికే అన్ని వర్గాల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన సూర్య.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాడు.
నిప్పురా.. నిజంగా బ్లడ్ పెట్టి చేశాడురా..: అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ పక్కా బ్రదర్..
బాంబ్ బ్లాస్ట్ సీన్..:
'నా పేరు సూర్య'కు సంబంధించి ప్రస్తుతం కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ బాంబ్ బ్లాస్ట్ సీన్ షూట్ చేసినట్టు సమాచారం. ఈ సీన్ ఔట్ పుట్ కూడా ఓ రేంజ్ లో వచ్చిందంటున్నారు. ఫస్ట్ ఇంపాక్ట్ తోనే తన టేకింగ్ పనితనమేంటో చూపించిన వక్కంతం వంశీ.. ఈ సీన్ ను కూడా అద్భుతంగా తెరకెక్కించినట్టు టాక్.
బన్నీ కెరీర్ లోనే హయ్యెస్ట్: 'నాపేరు సూర్య' శాటిలైట్ రైట్స్ ఎంతకు కొన్నారో తెలుసా?
ఇంతకీ సీన్ ఏంటి?:
ఉదయాన్నే హడావుడిగా ఆఫీసులకు పరుగుపెట్టేవాళ్లు.. రోడ్డు దాటుతూ స్కూలుకు వెళ్లే చిన్నారులు.. ఇలా ఎవరి ప్రపంచంలో వారు ఉన్నవేళ.. అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో ఓ బాంబ్ బ్లాస్ట్. ఊహించని ఈ పరిణామానికి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోతుంది.
ఇంతలో అక్కడికి సూర్య..:
బాంబ్ బ్లాస్ట్ జరగడమే ఆలస్యం.. అక్కడికి సూర్య వస్తాడు. అప్పటికే ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధిస్తారు. ఆవేశపరుడు, కోపిష్టి అయిన సూర్య.. అక్కడి దృశ్యాలను చూసి ఒక్కసారి చెమ్మగిల్లినవాడిలా మారుతాడు. అదే సమయంలో పరిస్థితులను చూసి రగిలిపోతాడు. ఆపై ఏం చేశాడన్నది మాత్రం ఇక తెరపై చూడాల్సిందే.
ఆ సీన్ హైలైట్ అంతే..
సినిమాలో బాంబ్ బ్లాస్ట్ సీన్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. రియలిస్ట్‌గా, కళ్లకు కట్టినట్టు చూపించేలా సీన్ ను తెరకెక్కించినట్టు టాక్. బన్నీ యాంగ్రీ లెవల్స్‌ను పీక్స్‌లో చూపిస్తున్న ఈ సినిమాలో.. కొన్ని సన్నివేశాలు 'టచ్ చేస్తే షాకే..' అనేలా ఉంటాయట. అంత పవర్ ఫుల్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
చిత్ర విశేషాలు:
సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కె.నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్నారు.