బాంబ్ స్క్వాడ్ లతో 'రక్త చరిత్ర' ప్రీమియర్ షో
రామ్ గోపాల్ వర్మ "రక్త చరిత్ర" చిత్రం ప్రీమియర్ షో జరిగే చోట వద్ద కూడా సెన్సేషన్ గా మారింది. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్..ప్రసాద్ మల్టీప్లెక్స్ వద్ద బాంబ్ స్క్వాడ్ లు నిన్న సాయింత్రం నుంచి పహారా మొదలైంది. ఆ చిత్రం ప్రీమియర్ షో ను కళాంజలి వారి సౌజన్యంతో ఐదు స్క్రీన్ లలో వేస్తున్నారు. దాంతో ఏ ప్రమాదమైనా తొంగి చూసే అవకాసమున్నదని ఈ విధమైన జాగ్రత్తలను ధియోటర్ యాజమాన్యం తీసుకున్నారు. ముఖ్యంగా ఓబుల్ రెడ్డికి చెందిన మనుష్యుల నుంచి ఏదైనా ప్రమాదముండే అవకాసమున్నదని భావించే ఈ ఏర్పాట్లు చేసారు. సినీ పరిశ్రమవారు ఇలాంటి టైట్ సెక్యూరిటీతో సినిమా రిలీజవటం ఇదే మొదట సారి అంటున్నారు. ఇక ఈ చిత్రంలో పరిటాలరవి గా వివేక్ ఒబరాయ్, మద్దెల చెరువు సూరిగా సూర్య నటిస్తున్నారు.
ఇక రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..ఒక సినిమాతో సందేశం ఇవ్వడం నా లక్ష్యం కాదు. 'వయొలెన్స్ కరెక్ట్ కాదు' అనే సందేశం కోసం ఈ సినిమా తీయలేదు. అయితే సినిమా ఏం చెప్పిందో జనం అర్థం చేసుకుంటారు. అలాగే అనంతపురంలో ఈ సినిమాని చూడాలనుకుంటున్నా. పరిటాల సునీత కానివ్వండి, మరొకరు కానివ్వండి, ఎవరు ఈ సినిమాని చూడాలనుకుంటారో వాళ్లందరికీ ఈ సినిమాని చూపిస్తాం అని స్పష్టం చేసారు. ఇక వివేక్ ఓబరాయ్, సూర్య, శత్రుఘ్న సిన్హా ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందింది. సినర్జీ ప్రొడక్షన్ పతాకంపై మధు మంతెన, శీతల్ వినోద్ తల్వార్, చిన్నా వాసుదేవరెడ్డి, రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి సి. కల్యాణ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











