బెయిలా? జైలా?..బాంబే హైకోర్టులో సల్మాన్ బెయిలుపై విచారణ
ముంబై: మద్యం మత్తులో కారు నడిపి ఒకరి ప్రాణాలు పోవడానికి, నలుగురు గాయపడటానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ముంబై సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే అతను బాంబే హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో రెండు రోజుల తాత్కాలిక బెయిల్ లభించింది. ఈరోజుతో సదరు బెయిల్ గడుపు ముగియబోతోంది.
కాగా...బెయిల్ గడువు పొడగింపు కోసం శుక్రవారం బాంబే హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. కోర్టులో వాదోప వాదాలు జరుగుతున్నాయి. మరికాసేపట్లో తీర్పువ వెలువడనుంది. సల్మాన్ కు బెయిల్ దొరికితే ఒకే..... లేక పోతే అతన్ని పోలీసులు జైలుకు తీసుకెళ్లనున్నారు.
ఈ విచారణకు సల్మాన్ ఖాన్ హాజరు కాలేదు. ఇంట్లోనే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విచారణకు హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయమై ఆయన అభిమానులు,సన్నిహితులు, బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కేసు వివరాలు...
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దేషిగా తేల్చింది. ఈ కేసులో అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి డి.డబ్ల్యు దేశ్ పాండే తీర్పు వెలువరించారు. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేనందు మరో రెండు నెలలు జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించారు. జడ్జి తీర్పు వెలువరించే సమయంలో సల్మాన్ ఖాన్ మొహంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ లేదు. తలదించుకుని ఉన్నారు.
కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవర్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది. ఆ సమయంలో సల్మాన్ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది. సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది.


Click it and Unblock the Notifications











