బొమ్మరిల్లు హాఫ్ సెంచరీ
సిద్ధార్థ, జెనిలియా జంటగా భాస్కర్ డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మించిన బొమ్మరిల్లు విడుదలై విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవం వైపు పరుగులు తీస్తోంది. చక్కని సెంటిమెంట్, సున్నితమైన హాస్యం మేళవించి అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం తొలి రోజు నుంచే హిట్ టాక్ సంపాదించుకుని కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారా అశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం 72 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం 151 ప్రింట్లతో రాష్ట్రమంతటా విజయఢంకా మోగిస్తోంది.
ఈ సందర్భాన్ని చిత్రం యూనిట్ బుధవారంనాడు హైదరాబాద్ శాంతి థియేటర్‌లో సెలబ్రేట్ చేసుకుంది. హీరో సిద్ధార్థ, దర్శకుడు భాస్కర్, నిర్మాత దిల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
బొమ్మరిల్లు విజయం తెలుగు చిత్రపరిశ్రమకు ఎంతో అవసరమని, ఇటువంటి చిత్రాలు హిట్ అయితే మరింత మంది నిర్మాతలు ఇలాంటి మంచి చిత్రాలు తీయడానికి ముందుకు వస్తారని సినీప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
హాసినిగా చక్కని పెర్ఫార్మెన్స్ అందించి అమాంతం అగ్ర హీరోయిన్‌గా అందలం ఎక్కేసిన జెనీలియా తాజా చిత్రం ఢీ విడుదలకు రెడీ అవుతోంది. బొమ్మరిల్లు విజయంతో ఢీ నిర్మాతలు జెనీలియా మానియాని క్యాష్ చేసుకోవచ్చనే ఆనందంలో ఉన్నారు. బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ ప్రస్తుతం ఎం.ఎస్.రాజు నిర్మించనున్న ఆట చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి బాస్ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య.


Click it and Unblock the Notifications