ప్రకాష్‌రాజుకు బొమ్మరిల్లు రైట్స్
తీవ్రమైన పోటీ నడుమ బొమ్మరిల్లు చిత్రం రీమేక్ రైట్స్‌ను చివరికి ప్రకాష్‌రాజ్ దక్కించుకున్నారని టాలీవుడ్ తాజా సమాచారం. తెలుగులో సూపర్‌హిట్ టాక్‌తో నడుస్తున్న ఈ చిత్రం తమిళ రైట్స్ కోసం నిర్మాతలు ఎడిటర్ మోహన్, ఎ.ఎం.రత్నం, ఇంకా తమిళ నటుడు విజయ్, దర్శక-నిర్మాత భాగ్యరాజా తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే, బొమ్మరిల్లు చిత్రంలో సిద్ధార్థ తండ్రిగా అద్భుతమైన నటన ప్రదర్శించిన ప్రకాష్‌రాజ్ షూటింగ్ సమయంలోనే ఈ చిత్రం రీమేక్ రైట్స్ గురించి నిర్మాత దిల్ రాజును అడిగారట. ఆయన మాట కాదనలేక నిర్మాత రాజు కూడా రీమేక్ రైట్స్‌ను ప్రకాష్‌రాజుకు ఇచ్చారని తెలుస్తోంది. అయితే, తమిళంలో ఈ చిత్ర నిర్మాతల్లో దిల్ రాజు కూడా భాగస్వామిగా ఉంటారని తెలుస్తోంది. తమిళంలో ప్రస్తుతం ప్రకాష్‌రాజ్ ఉదయ్‌కిరణ్‌తో రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు. గతంలో అనేక చిత్రాలను నిర్మాతగా రూపొందించిన ప్రకాష్‌రాజు బొమ్మరిల్లు రీమేక్ చేస్తూ మరో విజయాన్ని నిర్మాతగా తన ఖాతాలో జమ చేసుకోబోతున్నారు.


Click it and Unblock the Notifications