»   » బోనీ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు, రెండు దేశాల ఇష్యూ, మమ్మల్ని రానివ్వడం లేదు!

బోనీ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు, రెండు దేశాల ఇష్యూ, మమ్మల్ని రానివ్వడం లేదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటి శ్రీదేవి మరణించి ఒక రోజు గడిచిపోయింది. ఇండియన్ సినీ అభిమానులంతా విషాదంలో ఉన్నారు. ఆమె భౌతిక కాయం ఇండియా ఎప్పుడు వస్తుందా? కనీసం కడసారి చూపు అయినా దక్కుతుందా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు అభిమాలు. ముంబైలో శ్రీదేవి నివాస ప్రాంగణం అభిమానుల తాకిడితో కిక్కిరిసి పోతోంది. మరో వైపు శ్రీదేవి భౌతిక కాయాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కాగా... శ్రీదేవితో పాటు 'మామ్' చిత్రంలో నటించిన పాకిస్థానీ నటుడు అద్నన్ సిద్ధిఖీ అక్కడి పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు.

బోనీ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు

బోనీ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు

‘ప్రస్తుతం నేను దుబాయ్ లో ఉన్నాను. నిన్న రాత్రి బోనీ సాబ్‌ను కలిశాను. ఆయన చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు. ఆయన్ను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు' అని అద్నన్ చెప్పుకొచ్చారు.

పాకిస్థాన్లో కూడా

పాకిస్థాన్లో కూడా

కేవలం ఇండియాలోనే కాదు ఆమె అభిమానులు పాకిస్థాన్, అమెరికా, యూకె ఇంకా చాలా దేశాల్లో ఉన్నారు. అభిమానులంతా శ్రీదేవి మరణంతో విషాదంలో మునిగిపోయారు' అని అద్నన్ సిద్ధిఖీ తెలిపారు.

అపుడు శ్రీదేవి ఆమెను అమ్మలా ఓదార్చింది

అపుడు శ్రీదేవి ఆమెను అమ్మలా ఓదార్చింది

‘మామ్' చిత్రంలో శ్రీదేవి కూతురు పాత్రలో పాకిస్థానీ నటి సజల్ నటించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణవార్త విని సజల్ షాకైందని అద్నన్ తెలిపారు. మామ్ షూటింగ్ సమయంలోనే సజల్ తల్లి చనిపోయింది. అపుడు శ్రీదేవి ఆమెను అమ్మలా ఓదార్చారు. నువ్వు కూడా నా కూతురు లాంటిదానివి అని ధైర్యం చెప్పారు.... అని అద్నన్ గుర్తు చేసుకున్నారు.

నాలుగు రోజుల క్రితం అలా, ఇపుడు ఇలా

నాలుగు రోజుల క్రితం అలా, ఇపుడు ఇలా

నాలుగు రోజుల క్రితం మోహిత్ మార్వా వెడ్డింగ్‌కు నేను కూడా హాజరయ్యాను. అపుడు శ్రీదేవి ఎంతో అందంగా, సంతోషంగా కనిపించారు. ఇంతలోనే ఇలాంటి విషాదం ముంచకొస్తుందని అస్సలు ఊహించలేదు అని.... అద్నన్ తెలిపారు.

మమ్మల్ని రానివ్వడం లేదు

మమ్మల్ని రానివ్వడం లేదు

నేను, సజల్ ఇండియా వచ్చి శ్రీదేవి అంత్య క్రియల్లో పాల్గొనాలని అనుకున్నాం. కానీ భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న పరిస్థితులు మమ్మల్ని అక్కడికి రానివ్వడం లేదు, ఇది తమను మరింత బాధకు గురి చేస్తోంది అని.... అద్నన్ తెలిపారు.

English summary
Adnan informed Indian Express, “At present, I’m in Dubai and, last night, I met Bonny-saab (Boney Kapoor). He was crying like a baby. The entire nation must be so sad. So are people in Pakistan. Just imagine: People from everywhere, Pakistan, America, the UK and other parts, have been sending me condolence messages.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu