భారీ కార్ యాక్సిడెంట్: శ్రీదేవి భర్తకు గాయాలు(ఫోటో)
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కారు బుధవారం రాత్రి భారీ ప్రమాదానికి గురైంది. అదృష్ట వశాత్తు ఈ ప్రమాదం నుండి ఆయన స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఆయన కారు ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.
సతారా నుండి ముంబై తిరిగి వస్తుండగా సంఘటన చోటు చేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులో అత్యాధునిక రక్షణ వ్యవస్థతో కూడిన ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో భారీ యాక్సిడెంట్ జరిగినప్పటికీ బోనీ కపూర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

బోనీ కపూర్‌కు యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని ఆయన మేనేజర్ ధృవీకరించారు. బోనీ కపూర్ క్షేమంగా ఉన్నారని తెలిపారు. కారు భాగా ధ్వంసమైందని...ఆయనకు ఎలాంటి మేజర్ గాయాలు కాలేదని బోనీ కపూర్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
సంఘటనగురించి బోనీ కపూర్ మాట్లాడుతూ...'నిజంగా ఇది పెద్ద యాక్సిడెంట్. అయితే అదృష్ట వశాత్తు ఎయిర్ బ్యాగులు సమయానికి తెరుచుకోవడంతో అందరం క్షేమంగా బయట పడ్డాం' అని తెలిపారు. అయితే బోనీ కపూర్ డ్రైవర్‌కు మాత్రం తీవ్రమైన గాయాలయినట్లు తెలుస్తోంది. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాక్సిండెట్‌లో సడన్ జర్క్ ఇవ్వడం కారణంగా వెనక సీట్లో కూర్చుకున్న బాయ్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. 'తేవర్' మూవీ షూటింగ్ స్పాట్ నుండి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన సంభవించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











