బోనీ కపూర్ మాజీ భార్య మృతి
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ మాజీ భార్య మోనా కపూర్ కేన్సర్ వ్యాధితో సోమవారం మరణించింది. వ్యాధి తీవ్రం కావడంతో రెండు వారాల క్రితమే ఆమెను ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఆమె తుది శ్వాస విడిచారు. 48 ఏళ్ల మోనా ప్రస్తుతం ఫ్యూచర్ స్టూడియో సి.ఇ.ఓగా కొనసాగుతోంది. ఆమెకు అర్జున్, అన్షులా అనే ఇద్దరు పిల్లలున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం తెలుపడంతో పాటు, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. మోనా తనయుడు అర్జున్ కపూర్ యష్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న 'Ishaqzaade' అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
బోని కపూర్-మోనా పెళ్లయిన పదేళ్ల తర్వాత విడి పోయారు. ఆ తర్వాత బోనీ కపూర్ నటి శ్రీదేవిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











