twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. వకీల్ సాబ్‌ గురించి క్రేజీ న్యూస్ లీక్ చేసిన బోనికపూర్..

    |

    హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రానికి రీమేక్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

    వకీల్ సాబ్‌ సినిమాకు ముందు

    వకీల్ సాబ్‌ సినిమాకు ముందు

    వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌కు ముందు బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని లీక్ చేశారు. పింక్ సినిమాను తమిళంలో అజిత్‌తో నేర్కొండ పర్వాయ్ తీశాం. అందులో ఓ యాక్షన్ సీన్‌ను చేర్చాం అని బోని కపూర్ తెలిపారు.

    పవన్ కల్యాణ్ ఇమేజ్‌ కారణంగా

    పవన్ కల్యాణ్ ఇమేజ్‌ కారణంగా

    అయితే తెలుగులోకి వచ్చే సరికి పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వకీల్ సాబ్‌లో కొన్ని మార్పులు ఎక్కువగానే చేశాం. ఇక్కడి ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ సీన్లు జొప్పించాం. తమిళంలో కంటే తెలుగులో మరో ఫైట్ అదనంగా చేర్చాం అని బోని కపూర్ తెలిపారు.

    భిన్న భంగిమలు.. నైనా గంగూలి అందాల విందు అదరహో

    అక్కడ బిగ్‌బీ.. ఇక్కడ పవర్ స్టార్

    అక్కడ బిగ్‌బీ.. ఇక్కడ పవర్ స్టార్

    పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ వయసు మీద పడిన లాయర్‌గా కనిపించారు. తెలుగులో పవన్ కల్యాణ్ యంగ్ లాయర్‌ సత్యదేవ్‌గా కనిపించబోతున్నారు. అందుకే యాక్షన్ సీన్లను అదనంగా చేర్చాం అని బోని కపూర్ పేర్కొన్నారు.

    మార్చి 29న ట్రైలర్..

    మార్చి 29న ట్రైలర్..

    ఇదిలా ఉండగా, వేసవి సీజన్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమైన వకీల్ సాబ్ డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా ట్రైలర్ మార్చి 29వ తేదీన రానున్నది. ఈ ట్రైలర్‌లో భారీగా పంచ డైలాగ్స్ దట్టించినట్టు తెలుస్తున్నది. తెలుగులో దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

    English summary
    Power Star Pawan Kalyan's Vakeel saab is all set to release on April 9th. In this occassion, Producer Boney Kapoor shares a interesting news to media. He revealed two actions scenes in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X