Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. వకీల్ సాబ్ గురించి క్రేజీ న్యూస్ లీక్ చేసిన బోనికపూర్..
హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రానికి రీమేక్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వకీల్ సాబ్ సినిమాకు ముందు
వకీల్ సాబ్ సినిమా రిలీజ్‌కు ముందు బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ మీడియాతో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని లీక్ చేశారు. పింక్ సినిమాను తమిళంలో అజిత్‌తో నేర్కొండ పర్వాయ్ తీశాం. అందులో ఓ యాక్షన్ సీన్‌ను చేర్చాం అని బోని కపూర్ తెలిపారు.
పవన్ కల్యాణ్ ఇమేజ్ కారణంగా
అయితే తెలుగులోకి వచ్చే సరికి పవన్ కల్యాణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని వకీల్ సాబ్‌లో కొన్ని మార్పులు ఎక్కువగానే చేశాం. ఇక్కడి ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో పెట్టుకొని యాక్షన్ సీన్లు జొప్పించాం. తమిళంలో కంటే తెలుగులో మరో ఫైట్ అదనంగా చేర్చాం అని బోని కపూర్ తెలిపారు.
భిన్న భంగిమలు.. నైనా గంగూలి అందాల విందు అదరహో
అక్కడ బిగ్‌బీ.. ఇక్కడ పవర్ స్టార్
పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ వయసు మీద పడిన లాయర్‌గా కనిపించారు. తెలుగులో పవన్ కల్యాణ్ యంగ్ లాయర్ సత్యదేవ్‌గా కనిపించబోతున్నారు. అందుకే యాక్షన్ సీన్లను అదనంగా చేర్చాం అని బోని కపూర్ పేర్కొన్నారు.
మార్చి 29న ట్రైలర్..
ఇదిలా ఉండగా, వేసవి సీజన్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమైన వకీల్ సాబ్ డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా ట్రైలర్ మార్చి 29వ తేదీన రానున్నది. ఈ ట్రైలర్లో భారీగా పంచ డైలాగ్స్ దట్టించినట్టు తెలుస్తున్నది. తెలుగులో దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు.