శ్రీదేవి మరణం తరువాత తొలిసారి.. బోనికపూర్ మాటలు, ఆ విషయం ఇప్పటికీ!
Recommended Video

ఈ ఏడాది ఫ్రిబ్రవరి 24 న అతిలోక సుందరి శ్రీదేవి అనూహ్య పరిస్థితుల నడుమ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మరణం భారత సినీ ప్రేముకులందరికీ షాకింగే. ఆమెది మరణించే వయసు కాదు. పైగా చలాకీగా ఆరోగ్యంగా ఉంది. దుబాయ్ లో పెళ్ళికి హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడ ఓ హోటల్ లో బాత్ టబ్ లో పడి చనిపోవడం అభిమానులు జీర్ణించుకోలేని, నమ్మశక్యం కానీ విషయం. అక్కడ చోటుచేసుకున్న ఘటన గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. శ్రీదేవి మరణంపై అనేక అనుమానాలు ఉన్నప్పటికీ ఆ విషయాన్నీ అణగదొక్కేశారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. శ్రీదేవి తరువాత తొలిసారి బోనీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అకస్మాత్తుగా
శ్రీదేవి మా జీవితాల నుంచి అకస్మాత్తుగా వెళ్లిపోయిందని బోనికపూర్ అన్నారు. శ్రీదేవి మరణంతో మా ఫ్యామిలి చాలా పనులు నిలిచిపోయాయని బోనికపూర్ అన్నారు.

తల్లి, తండ్రి నేనే
ఇకపై తన పిల్లలకు తల్లి,తండ్రి అని నేనే అని బోనీ కపూర్ అన్నారు. వారి జీవితాలని సెటిల్ చేసేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు బోనీ కపూర్ అన్నారు. శ్రీదేవి మరణం తరువాత వాయిదా పడ్డ అంశాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని తిరిగి ప్రారంభించి పూర్తి చేయాలని బోని అన్నారు.

శ్రీదేవి మరణించిందనే వాస్తవం
శ్రీదేవి మరణించిందనే వాస్తవాన్ని తాను ఇప్పటికి నమ్మలేకపోతున్నానని బోనీ కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణం తరువాత తన కొడుకు అర్జున్ కపూర్ తో చేరువవుతున్న సంగతి తెలిసిందే.

ఆ విషయం మాత్రం
శ్రీదేవి మరణించడానికి దారి తీసిన పరిస్థితుల గురించి మాత్రం ఈ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడలేదు. శ్రీదేవి బాత్ టబ్ లో పడి మరణించిందనే విషయమే చాలా ఆశ్చర్యకరం. ఆ తరువాత దుబాయ్ లో జరిగిన పరిణామాలు కూడా శ్రీదేవి మృతి విషయంలో అనుమానాలు పెంచాయి. చివరకు దుబాయ్ ప్రభుత్వమే ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అంటూ సర్టిఫికెట్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications