»   » శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను చంపేస్తామని బెదిరింపులు

శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను చంపేస్తామని బెదిరింపులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, హీరోయిన్ శ్రీదేవి భర్త బోనీ కపూర్‌కు చంపేస్తామని అండర్ వరల్డ్ గ్యాంగుకు చెందిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమేరకు ముంబైలోని ఓషివరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది.

ఈ బెదిరింపులకు గతంలో కపూర్ ఇంట్లో జరిగిన ఓ సంఘటన కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం బోణీకపూర్ ఇంట్లో రూ. 6 లక్షల విలువైన సొత్తు దొంగిలించబడింది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఆ వ్యక్తులే బోనీ కపూర్‌కు బెదిరింపులు చేసినట్లు తెలుస్తోంది.

బెదింపులకు పాల్పడిన వారు రవి పూజారా గ్యాంగుకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులకు అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

బాలీవుడ్ సీనీ పరిశ్రమకు అండర్ వరల్డ్ బెదింపులను ఓ చీకటి కోణంగా చెప్పుకోవచ్చు. పలువురు బాలీవుడ్ స్టార్లకు అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలు సైతం ఉన్నట్లు గతంలో తేలింది. మరి మన అభిమాన తార శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్‌కు ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలని కోరుకుందాం.

English summary
The well-known Boney Kapoor has been receiving death threats from what is believed to be an underworld gang and as a result, lodged a complaint in the Oshiwara police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu