twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ : కనీసం మాటలు కూడా లేవు..అన్నయ్య అర్జున్ కపూర్ ఇంటికి వెళ్లిన జాన్వీ, ఖుషి !

    |

    Recommended Video

    శ్రీదేవి మరణం తర్వాత ఇలా జరుగుతోందా?

    గతంలో శ్రీదేవి కుటుంబానికి, బోనికపూర్ మొదటి భార్య ఫ్యామిలీకి కనీసం మాటలు కూడా లేవు. అర్జున్ కపూర్ కూడా తండ్రి కుటుంబంతోకలిసే వాడు కాదు. కనీసం తండ్రితో కూడా మాట్లాడేవాడు కాదు. అలాంటిది శ్రీదేవి మరణం తరువాత అర్జున్ కపూర్ చెల్లెళ్లని, తండ్రిని చేరదీస్తున్నాడు. శ్రీదేవి చనిపోయినప్పుడు అంత్యక్రియల కార్యక్రమాన్ని అర్జున్ కపూర్ దగ్గరుండి చూసుకున్న సంగతి తెలిసిందే. తాజగా ఇద్దరు కూతుళ్లతో కలసి బోనికపూర్ తన అర్జున్ కపూర్ ఇంటికి వెళ్లారు. ఏతండ్రి కొడుకుల అనుభందం, దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    శ్రీదేవి మరణంతో తండ్రికి చేరువగా

    శ్రీదేవి మరణంతో తండ్రికి చేరువగా

    శ్రీదేవి ఉన్నపుడు ఆమె కుటుంబంతో అర్జున్ కపూర్ మాట్లాడేవాడు కూడా కాదు. కనీసం తండ్రితో కూడా మాటలు లేవని బాలీవుడ్ వర్గాలు అంటుండేవి. అలాంటిది శ్రీదేవి మరణం తరువాత అర్జున్ కపూర్ లో చాలా మార్పు వచ్చింది.

    చెల్లెళ్ళ కోసం

    చెల్లెళ్ళ కోసం

    తల్లి మరణంతో తల్లడిల్లుస్తున చెల్లెళ్ళని చేరదీయాలని అర్జున్ కపూర్ భవించాడు. అందుకే తన సోదరి అన్షులా తో కలసి తండ్రికి, చెల్లెళ్లకు అండగా నిలిచాడు. శ్రీదేవి అంత్యక్రియల కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించాడు.

    బోనికపూర్ ప్రశంసలు

    బోనికపూర్ ప్రశంసలు

    శ్రీదేవి మరణించ తరువాత నా కొడుకు, కుమార్తె అందించిన సహకారం మాటల్లో చెప్పలేనిది బోనికపూర్ అర్జున్ కపూర్, అన్షులాని ప్రశంసించిన సంగతి తెలిసిందే.

    అన్నతో కనీసం మాటలు కూడా లేవు

    అన్నతో కనీసం మాటలు కూడా లేవు

    శ్రీదేవి ఉన్న సమయంలో జాన్వీ, ఖుషి.. అర్జున్ కపూర్ తో కనీసం మాట్లాడేవారు కూడా కాదు. వారి మధ్య అన్నా చెల్లెళ్ళ అనుభందం అప్పట్లో లేదు. తల్లి మరణం తరువాత అర్జున్ కపూర్ చూపించిన ప్రేమకు జాన్వీ, ఖుషి పొంగిపోయారు. ఇప్పుడు ఎలాంటి బిడియం లేకుండా అన్నతో కలసి మాట్లాడుతున్నారు.

     అన్నకోసం నేరుగా ఇంటికే

    అన్నకోసం నేరుగా ఇంటికే

    బోనికపూర్ తన కుమార్తెలు ఇద్దరితో గత రాత్రి అర్జున్ కపూర్ నివాసానికి వెళ్లడం విశేషం. తిరిగి వెళ్లే సమయంలో అర్జున్ కపూర్ కరువరకు వచ్చి వారిని సాగనంపి మరి వెళ్ళాడు.

    కొడుకుకు ముద్దు

    కొడుకుకు ముద్దు

    కారు ఎక్కే సమయంలో బోనికపూర్ అర్జున్ కపూర్ మధ్య బంధం స్పష్టంగా కనిపించింది. అర్జున్ కపూర్ ని కౌగిలించుకున్న బోని కపూర్ కొడుకుకు ముద్దు ఇచ్చి బయలుదేరడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    English summary
    Boney Kapoor, son Arjun bond well. pic goes viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X