ప్రియా ప్రకాశ్ వారియర్‌కు బోనీ కపూర్ ఝలక్.. అమ్మడు ఆశలు ఆవిరి
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుంది. అలాగే, ఫ్లైయింగ్ కిస్ గన్‌తో ఫిల్మ్ మేకర్లు తన వైపు చూసేలా చేసుకుంది. ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆమె అందరికీ సుపరిచితురాలు అయిపోయింది. దీంతో అన్ని భాషల్లో ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయి. చాలా సినిమాలు ఓకే చేసేసింది కూడా. ప్రస్తుతం చాలా సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.
ఇందులో భాగంగానే ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో 'శ్రీదేవి బంగ్లా' అనే సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్ మాంబుల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్‌ను కొద్దిరోజుల క్రితం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో ఆమె పేరు శ్రీదేవి అవడం.. అందునా ఆమె నటిగా కనిపించడం.. చివర్లో బాత్ టబ్‌లో మరణించి ఉండడం చూసి ఇది అందాల నటి శ్రీదేవి బయోపిక్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ చిత్ర దర్శక నిర్మాతలపై గతంలో ఫైర్ అయ్యారు. అంతేకాదు, సినిమా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. అయినా చిత్ర యూనిట్ దీనిపై స్పందించలేదు. దీంతో ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. 'శ్రీదేవి బంగ్లా' దర్శక నిర్మాతలకు బోనీకపూర్ నోటీసులు పంపారు. కానీ, వారి నుండి ఎలాంటి స్పందనా లేదు. దీంతో తదుపరి చర్యగా 'శ్రీదేవి బంగ్లా' సినిమాను ఆపేయాలని కోరుతూ బోనీకపూర్ కోర్టులో పిటిషన్ వేయబోతున్నారని తెలుస్తోంది.
ప్రియ ప్రస్తుతం బాలీవుడ్, మాలీవుడ్‌లతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా నితిన్-చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్రయూనిట్ కొద్దిరోజుల క్రితం నిర్వహించింది. భవ్య క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ నటిస్తుండగా.. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











