అబ్బే..మమ్మల్ని ఎవరు కొట్టారు?
సురేష్ బాబు, సునీల్ నారంగి, శ్రీధర్, జగదీష్ లు తమపై దాడిచేసారంటూ వచ్చిన వార్తలను బోణి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సరస్వతి ఫిలింస్ వారు ఖండించారు. రెండు రోజుల క్రిందట మీడియా సమావేశం ఏర్పాటు చేసి సురేష్ బాబు రౌడీలా బిహేవ్ చేస్తున్నారని, ఆయన పరిశ్రమను మాఫియా డాన్ లా గుప్పిట్లో పెట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ చలనచిత్ర పరిరక్షణ సమితితో కలిసి వీరు ఆరోపణలు చేసారు. అయితే ఏం రాజీలు జరిగాయో గానీ అటువంటిదేమీ లేదని, వారు చాలా బాగా సహకరిస్తున్నారని మళ్లీ ప్రెస్ నోట్ విడుదల చేసారు. దాంతో వారు పిలవగానే వెళ్ళిన మీడియా వారు తెల్లముఖాలు వేసుకోవాల్సి వచ్చిందని కవర్ చేసిన వాళ్లు కామెంట్స్ చేసుకుంటున్నారు.
సరస్వతి ఫిలింస్ అధినేత బి.రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఇలా ఉంది..'బోణి' ప్రదర్శనకు ఎంపిక చేసుకున్న ఒకటి రెండు థియేటర్‌లకు సంబంధించి కొంత గందరగోళం నెలకొన్న సందర్భంగా పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకున్నామన్నారు. 'బోణి" విడుదలకు సంబంధించి సురేష్ మూవీస్ మరియు ఏషియన్ ధియేటర్స్ వారు పూర్తి సహకారం అందిస్తున్నారని, ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. 'బోణి" చిత్రాన్ని నైజాంలో ప్రదర్శించే అవకాశానిచ్చిన నిర్మాత రమణ గోగులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. బోణి చిత్రం ఈనెల 12 న విడుదల కాబోతున్నది.


Click it and Unblock the Notifications











