Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బూచమ్మ...బూచోడు వచ్చే డేట్ ఫిక్సయింది, డీటేల్స్...
హైదరాబాద్: శివాజీ కథానాయకుడిగా స్నేహా మీడియా మరియు హెజన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం బూచమ్మ బూచోడు. రాగిణి ఎమ్.ఎమ్.ఎస్ ఫేమ్ కైనాజ్ మోతివాలా కథానాయిక. గుణశేఖర్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన రేవన్ యాదు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రమేష్ అన్నంరెడ్డి - ప్రసాద్ రెడ్డి నిర్మాతలు.
నిర్మాణానంత కార్యక్రమాలు పూర్తయి, తొలి కాపీ సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చింది. ఎంటర్టైన్మెంట్తో సాగుతూనే ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాం. బూచమ్మ బూచోడు అనే టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తేనే అర్థం అవుతుందని తెలిపారు.
కథ, కథనాలు ఓ హైలెట్ అయితే... దాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం మరో హైలెట్ అన్నారు. దర్శకుడు చెబుతూ...రాజ్ భాస్కర్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ. నేపథ్య సంగీతం కూడా కథకు అనుగుణంగానే సాగుతుంది. శివాజీ, నిర్మాతల సహకారంతో అనుకొన్నది అనుకొన్నట్టు తీర్చిదిద్దామని తెలిపారు.
తప్పకుండా మా టీమ్‌కి మంచి పేరొస్తుందన్న నమ్మకం ఉంది. కైనాజ్ మోతీవాలా తన గ్లామర్‌తోనూ, నటనతోనూ అందరినీ ఆకట్టుకొంటుందన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ నటించారు. కథ, మాటలు: సాయికృష్ణ కెమెరా: విజయ్ మిశ్రా సంగీతం: రాజ్ భాస్కర్ సాహిత్యం: శ్రీమణి కూర్పు: ప్రవీణ్ పూడి నిర్మాతలు: రమేష్ అన్నంరెడ్డి , ప్రసాద్ రెడ్డి దర్శకత్వం: రేవన్ యాదు.