ఆ సూపర్ హిట్ సినిమా పుస్తకరూపంలో..
గాంధీజీ ప్రవచించిన అహింస సిద్దాంతాన్ని నిజ జీవితానికి అన్వయిస్తూ రూపొంది విజయం సాధించిన 'లగేరహో మున్నాభాయ్' చిత్రం ఇప్పుడు పుస్తకరూపంలో లభించనుంది. సోమవారం ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఈ చిత్రం హీరో సంజయ్ దత్ మాట్లాడుతూ. ఈ పుస్తకంలో ఈ చిత్రం స్క్రీన్ ప్లే రాసి ఉంది. అలాగే డైలాగులు,ముఖ్యమైన ఘట్టాలు వివరణ ఉంది. నేను ఈ పుస్తకాన్ని బాగా ఎంజాయ్ చేసాను అన్నారు.
సంజయ్ దత్ ఈ చిత్రంలో మున్నాభాయ్ అనే రౌడీగా కనిపించి నవ్విస్తారు. మున్నాభాయ్ ఎంబిబియస్ చిత్రానికి ఇది సీక్వెల్. ఓం బుక్స్ ఇంటర్నేషనల్, వినోద్ చోప్రా ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాయి.
సంజయ్ దత్ లగేరహో మున్నాభాయ్ విధువినోద్ చోప్రా గాంధీజీ అహింస ఓం బుక్స్ వినోద్ చోప్రా ఫిలిమ్స్ sanjay dutt lage raho munnabhai vidhu vinod chopra gandhi


Click it and Unblock the Notifications