»   » ‘విశ్వవిజేత విజయగాథ’ అంటూ దాసరిపై పుస్తకం

‘విశ్వవిజేత విజయగాథ’ అంటూ దాసరిపై పుస్తకం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వయంకృషి, ప్రతిభ, అపారమైన తెలివితేటలతో అంచలంచెలుగా ఎదిగిన దర్శకశిఖరం డాక్టర్ దాసరి నారాయణరావు. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రముఖ హీరోల కెరీర్లో గుర్తుంచుకోదగ్గ హిట్స్ ఇచ్చారు. మూడు తరాల అగ్రకథానాయకులతో కూడా ఆయన పని చేసారు.

మాస్ హీరోలకు ఉండే ఫాలోయింగునీ, ఇమేజ్‌నీ దర్శకులకు ఆపాదించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న దాసరి ఇప్పటి వరకు 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన 150 చిత్రాల సమగ్ర సమాచారాన్ని పొందు పరుస్తూ సీనియర్ జర్నలిస్టు వినాయకరావు 'విశ్వవిజేత విజయగాథ' అనే పుస్తకం రాసారు.

డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. కళాబంధు డాక్టర్ డి. సుబ్బిరామిరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో చలన చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు పాల్గొంటారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, కె. విశ్వనాథ్, డి. రామానాయుడు, మోహన్ బాబు, చిరంజీవి, జయసుధ, నాగార్జునతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పాల్గొన బోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

English summary
A book featuring the exclusive glimpses and rare news about the director, producer, actor, writer and politician Dasari Narayana Rao during his wonderful Filmy career is all set for release. Titled ‘Viswa Vijetha Vijayagadha’, writer U Vinayaka Rao has encapsulated the legendary director’s life in words.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu