‘సంగీతం యాంత్రీకరణ’పై యేసుదాసు ఆందోళన
సంగీత ప్రపంచంలో రోజు రోజుకు యాంతీకరణ పెరిగి పోతుండటంపై ప్రముఖ నేపథ్య గాయకుడు యేసుదాసు ఆందోళన వ్యక్తం చేశారు. సంగీతమనేది అనిర్వచనీయమైనది, స్వచ్ఛమైన సంగీతం ద్వారానే బ్రహ్మానందాన్ని అనుభవించగలుగుతాం, కానీ ప్రస్తుత కాలంలో సంగీతం యాంత్రీకరణకు నోచుకుంది. కంప్యూటర్లే అన్ని పనులు చేస్తున్నాయి. బాణీలు కడుతున్నాయి. తాళం వేస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటప్పడు సంగీత పురస్కారాలను గాయకులకు బదులు కంప్యూటర్లకు ఇస్తేనే సరిపోతుందని వ్యాఖ్యానించారు.
తన జీవితంపై రవి మీనన్ రంచించిన 'అతిశయ రాగం" అనే పుస్తక ఆవిష్కరణ సందర్బంగా యేసుదాసు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకం యేసుదాసు సంగీత ప్రయాణాన్ని వివరించేదిగా ఉంటుందని రచయిత తెలిపారు.


Click it and Unblock the Notifications