పవన్ ని తిడుతూ పుస్తకం: వెనక ఎవరు?

ఇక ఈ పుస్తకం ఎలక్షన్స్ దాదాపు ప్రచారం పూర్తవుతున్న వేళ విడుదలయ్యింది. ఎంతవరకూ ఈ పుస్తకం ప్రజల్లోకి చొచ్చుకెళ్తుంది. ఎంతవరకూ క్లిక్ అవుతుంది. పుస్తకం ద్వారా రచయిత ఏం ప్రయోజనం ఆశించారు అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ పుస్తకం రచన వెనక వైయస్ ఆర్పీ పార్టీ ఉందని కొందరు అంటున్నారు. నిజమేమిటన్నది తెలియరాలేదు.
గతంలో పార్టీలన్నీ బ్రష్టుపట్టిపోయాయని విమర్శించిన పవన్, ఇప్పుడు మోడీ జపం చేస్తూ టీడిపికి వంత పాడటం ఏమిటని ఈ పుస్తకంలో ఆయన ప్రశ్నించారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తనకు కులం,మతం, ప్రాంతం, తేడాల్లేవని ప్రగల్బాలు పలికిన పవన్ పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు పెద్ద అవినీతి పరుడని విమర్శించిన పవన్ ఇప్పుడు సీమాంధ్ర అభివృద్ది ఆయనతోనే సాధ్యమని అనటం ఏమిటని ధ్వజమెత్తారు.

అలాగే చంద్రబాబు సింగపూర్ లో డబ్బు దాచుకున్నారని విమర్శించి ఇప్పుడు రెండు రాష్ట్రాలను బాబు మాత్రమే సింగపూర్ లా తీర్చిదిద్దగలరని ఎలా అంటున్నారని పవన్ ని ప్రశ్నించారు. మహిళలపై యాసిడ్ దాడులు జరిగినప్పుడు, దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగినప్పుడు స్పందిచని పనవ్ ఇప్పుడు రాష్ట్ర విభజన తో దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందనటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేసారు.
ఇన్ని సంవత్సరాలుగా ఏమీ మాట్లాడకుండా హఠాత్తుగా కేవలం ఎన్నికల సమయంలో పవన్ ఇలా పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఆయన్ని సీమాధ్ర ప్రజలు నమ్మస్ధితిలో లేరని తేల్చి చెప్పారు. తెలంగాణాలో ఒకలా,సీమాధ్రలో మరోలా మాట్లాడుతున్న ఆయన ఇరు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం లేకుండా చేస్తున్నారని అన్నారు.


Click it and Unblock the Notifications











