ఐష్ డెలివరీ డేట్ 11/11/11 పై 150 కోట్ల బెట్టింగ్?
గర్భవతిగా ఉన్న ఐశ్వర్యరాయ్ నవంబర్ నెలలోనే ప్రసవిస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఐష్ ఏ తేదీన ప్రసవిస్తుందనే విషయం మాత్రం ఇంత వరకు బయటకు పొక్కలేదు. ఇదే అదునుగా పందెం రాయుళ్లు వందల కోట్ల రూపయాల బెట్టింగ్ కు తెర లేపారు. ఆమె 11/11/11 తేదీన ప్రసవిస్తుందనే అంశంపై ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా రూ. 150 కోట్ల బెట్టింగ్ సాగుతోందని సమాచారం. మరి కొందరు మాత్రం 14/11/11 తేదీనే ఐష్ ప్రసవిస్తుందని బెట్టింగ్ కాసినట్లు ముంబై వర్గాల సమాచారం. దీనికి తోడు ఐష్ ఆడ బిడ్డకు జన్మనిస్తుందా? లేక మగ బిడ్డకు జన్మిస్తుందా? కవల పిల్లలను కంటుందా? అనే అంశాలపై కూడా జోరుగా బెట్టింగ్ సాగుతోంది.
ఐశ్వర్యరాయ్ డెలివరీ కోసం బచ్చన్ కుటుంబం ముంబాయ్ లోని అంథేరిలో గల 7హిల్స్ హిస్పిటల్ విఐపి సూట్ బుక్ చేసింది. ఈ నెల 10 నుండి 15వరకు ఈ సూట్ ని బుక్ చేశారని సమాచారం. 800ఏళ్లకి ఒకసారి వచ్చే ఫ్యాన్సీ డేట్-11-11-11 కాబట్టి, ఆ ప్రత్యేకమైన తేదీన ఐశ్వర్య రాయ్ బిడ్డకు జన్మనిస్తే బాగుంటుందని ఈ కుటుంబం భావితస్తోందట. ఇందుకోసం ఆమెకు సిజేరియన్ చేయించాలని బచ్చన్ కుటుంబం భావిస్తున్నట్లు పుకార్లు గుప్పుమన్నాయి. ఇన్నాళ్లూ ఆమె నటించిన సినిమాలు గురించిన మాట్లాడుకున్నవాళ్లు ఇప్పుడు ఆమె జన్మనివ్వబోతున్న బిడ్డ గురించి చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ అందాల రాశి ఆమెను మించిన అందమైన బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుందాం....


Click it and Unblock the Notifications











