BookMy Show 2024 Top RECORDS: ఈ ఏడాది బుక్ మై షో టాప్ రికార్డులు.. పుష్ప 2 ఏ స్థానంలో నిలిచిందంటే..?

BookMyShow 2024 RECORDS: మరి కొద్ది రోజులలో ఈ ఏడాదికి ఎండ్ కార్డ్ పడబోతుంది. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇకపోతే ఈ ఏడాది ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి, అలరించాయి. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలువగా, మరికొన్ని సినిమాలు డిజాస్టర్ గా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో .. సినిమాలు క్రియేట్ చేసిన రికార్డులను తన నివేదికలో వెల్లడించింది. 2024 లో బుక్ మై షో లో రికార్డు నమోదు చేసిన సినిమాలేంటీ? ఈ రికార్డులేంటో? ఓ లుక్కేద్దామా..

2024లో సినిమా ఇండస్ట్రీలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ సినిమాలు కూడా పలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అందులో అందులో కల్కి 2898 ఏడి, పుష్ప2, స్త్రీ 2, సింగం ఏగైన్, భుల్ భూల్లయ్య 2 వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు సందడి చేశాయి. అయితే ఈ సినిమాలలో పుష్ప 2 సినిమా 2024 స్పెషల్ సినిమా అని చెప్పవచ్చు. ఈ ఏడాది చివరలో విడుదలై పలు రికార్డులను క్రియేట్ చేసిందని చెప్పాలి.

BookMyShow 2024 throwback report Pushpa 2 movie sold most tickets in 2024

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఒక్కరోజులో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా అల్లు అర్జున్ పుష్ప 2 నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో వెల్లడించింది. పుష్ప 2 సినిమాను ఒక్క రోజులో అత్యధికంగా 10.8 లక్షలమంది సోలో ఆడియన్స్ వీక్షించినట్లు తెలియజేసింది. 2021లో వచ్చిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా కనిపించింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1508 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఇదిలా ఉంటే బుక్ మై షో (BookMyShow 2024 RECORDS)విడుదల చేసిన నివేదికలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వెలువడ్డాయి. ఈ ప్లాట్ ఫామ్ లో ఈ ఏడాది నవంబర్ 1న దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన సింగం అగైనండ్, భూల్ భూలయ్యా 3- సినిమాల సందర్భంలో రికార్డ్ స్థాయిలో 2.3 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయినట్టు పేర్కొంది. ఇది ఒకే రోజులో అత్యధికంగా టికెట్లు అమ్మినట్టు తెలుస్తోంది.

అలాగే ఈ ఏడాది మోస్ట్ వాచ్డ్ ఇండియన్ మూవీస్ టాప్ 10 జాబితా (most watched Indian films of the year)ను విడుదల చేసింది. అందులో..కల్కి 2898 ఏడీ, స్ట్రీ 2, పుష్ప 2, హనుమాన్, అమరన్, భూల్ భూలయ్యా 3, దేవర, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్), మంజుమ్మెల్ బాయ్స్, సింగం 2 లు వరుసగా నిలిచాయి.

అంతేకాకుండా ఇండియాలో అత్యధికంగా వీక్షించిన హాలీవుడ్ సినిమాల జాబితా (most watched Hollywood films)ను కూడా విడుదల చేసింది. టాప్ 10లో మొదటి స్థానంలో డెడ్‌పూల్ & వుల్వరైన్ (Deadpool & Wolverine)నిలువగా.. తరువాత స్థానంలో గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ (Godzilla x Kong: The New Empire ), కుంగ్ ఫూ పాండా 4 (Kung Fu Panda 4), వినమ్: లాస్ట్ డ్యాన్స్ (Venom: The Last Dance), ఇన్‌సైడ్ అవుట్ 2 (Inside Out 2), డ్యూన్ (Dune: Part Two) కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (Kingdom Of The Planet Of The Apes), ఇట్స్ ఎండ్స్ విత్ ఆస్ ( It Ends With Us), మోనా 2 (Moana 2), డిస్పికేబుల్ మీ 4 (Despicable Me 4) లు నిలిచాయి.

అంతేకాకుండా రీ రిలీజ్ సంబంధించిన జాబితాను కూడా ఈ సందర్భంగా విడుదల చేసింది ఇందులో కూడా టాప్ 10 re-releases సినిమాల జాబితాలో తుంబాద్ సినిమా మొదటి స్థానంలో నిలువగా, గిల్లి, రాక్‌స్టార్, లైలా మజ్ను, మురారి, కల్ హో నా హో, గబ్బర్ సింగ్, . రెహనా హై టెర్రే దిల్ మే, వీర్-జారా, దేవదూతన్ లు వరుసగా నిలిచాయి. ఇక ఇక కల్కి 2898, దేవర, హనుమాన్, గోట్, అమరన్ సినిమాలకు రిపీటెడ్ ఆడియన్స్ వచ్చారంటూ నివేదికలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X