»   » అల్లు అర్జున్ మెగాస్టార్ అయితే మరి చిరంజీవి ఎవరు?... ఫ్యాన్స్ ఫైర్!

అల్లు అర్జున్ మెగాస్టార్ అయితే మరి చిరంజీవి ఎవరు?... ఫ్యాన్స్ ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ చిత్ర సీమకు సంబంధించి మెగాస్టార్ అంటే అందరూ చిరంజీవి పేరే చెబుతారు. మెగాస్టార్‌గా ఆయన స్థానం భర్తీచేయలేనిది. అలాంటి స్థాయి, అర్హత కూడా ఆయన తర్వాత వచ్చిన ఏ హీరోకూ లేదు అనేది ఇండస్ట్రీకి చెందిన వారు చెబుతున్న మాట.

మరి ఈ విషయం తెలియక జరిగిందో.... తెలిసే కావాలని చేశారో? ఏమో కానీ... ప్రముఖ ఆన్ లైన్ మూవీ టికెట్ బుకింగ్ పోర్టల్ 'బుక్ మై షో' వారు తమ వెబ్ సైట్లో అల్లు అర్జున్‌ను మెగాస్టార్ గా పేర్కొనడంపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

అల్లు అర్జున్ మెగాస్టార్ అయితే చిరంజీవి ఎవరు?

అల్లు అర్జున్ మెగాస్టార్ అయితే చిరంజీవి ఎవరు?

అల్లు అర్జున్ మెగాస్టార్ అయితే మరి.... చిరంజీవి ఎవరు? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో బుక్ మై షో వెబ్ సైట్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయమూ ఓ మెగా అభిమాని పెట్టిన పోస్ట్ ఇపుడు వైరల్ అయింది.

నివురుగప్పిన నిప్పు

నివురుగప్పిన నిప్పు

రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు మెగా అభిమానులంటే... మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలందరినీ అభిమానించేవారు. తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీరిలో చిలిక వచ్చిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మెగా అభిమానుల్లోని వర్గాల మధ్య పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని అంటున్నారు.

మూడు వర్గాలు నిజమేనా?

మూడు వర్గాలు నిజమేనా?

గతంలో జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే... మెగా అభిమానుల్లో మూడు వర్గాలు ఏర్పడ్డాయని, చిరు-రామ్ చరణ్ ఫ్యాన్ వర్గం, పవర్ స్టార్ ఫ్యాన్ వర్గం, అల్లు అర్జున్ అభిమాన వర్గం ఇలా చీలిక వచ్చిందని చర్చించుకుంటున్నారు.

పుకార్లు

పుకార్లు

పవన్ కళ్యాణ్, బన్నీ అభిమానుల మధ్య పలు సందర్భాల్లో విబేధాలు బహిరంగంగానే పొడచూపాయి. అల్లు అర్జున్ మెగా ఇమేజ్ సర్కిల్ నుండి బయటపడి.... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని, తనకంటూ ఓ ప్రత్చేకమైన అభిమాన వర్గాన్ని ఫాంచే స్తున్నాడనే రూమర్స్ కూడా ఉన్నాయి.

మెగా హీరోలంతా ఒక్కటే.... అభిమానులు ఏకం కావాలి

మెగా హీరోలంతా ఒక్కటే.... అభిమానులు ఏకం కావాలి

ఈ పరిణామాలను గమనించిన పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు.... ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించే ధైర్యం చేయకపోయినా, తామంతా ఒక్కటే అని, తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, అభిమానులంతా ఏకం కావాలని చెప్పే ప్రయత్నం చేశారు.

English summary
Online ticketing website BookMyShow addressed Allu Arjun as the megastar that didn’t go down well with the mega fans. They started attacking BookMyShow for not knowing the ‘prestigious titles’ of a star hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu