ఒక్కో సెకన్ 16 టికెట్లు అమ్మేశారు: 2018లో సూపర్ స్టార్ స్పీడును ఎవరూ అందుకోలేదు!
Recommended Video

ఆన్‌లైన్ సినిమా టికెట్ బుకింగ్ అనగానే మనకు 'బుక్ మై షో' గుర్తుకు వస్తుంది. తాజాగా ఈ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. డిసెంబర్ 1, 2017 నుంచి డిసెంబర్ 18, 2018 వరకు తమ వెబ్ సైట్ ద్వారా జరిగిన సినిమా టికెట్ అమ్మాల గురించిన వివరాలు బయట పెట్టారు.
2018 సంవత్సరంలో మొత్తం 1780 చిత్రాలు బుక్ మై షో ద్వారా టికెట్ల అమ్మకం జరుపుకున్నాయి. అయితే అన్ని చిత్రాల్లో కంటే సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన 2.0 మూవీ టికెట్లు అత్యంత వేగంగా అమ్ముడయ్యాయట.

సెకనుకు 16 టికెట్లు
2.0 చిత్రానికి సంబంధించిన టికెట్లు అత్యంత వేగంగా సెకనుకు 16 చొప్పున అమ్ముడయ్యాయట. దీన్ని బట్టి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదలైతే క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

హిందీలో హయ్యెస్ట్ గ్రాస్
బుక్ మై షో ద్వారా హిందీలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రం ‘పద్మావత్'. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపిక పదుకోన్, రణవీర్, షాహిద్ కపూర్ నటించిన ఈ చిత్రం భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

డ్రామాలు ఎక్కువ చూశారు
బుక్ మై షో రిపోర్ట్ ప్రకారం 2018లో ప్రేక్షకులు యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ జోనర్ల కంటే.... డ్రామా జోనర్ చిత్రాలను ఎక్కువ ఇష్టపడ్డారట. దీంతో పాటు ఆదివారం మధ్యాహ్నం సమయంలో సినిమా చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారట.

హిందీ సినిమా ఆధిపత్యం
దేశ వ్యాప్తంగా అన్ని సినిమా పరిశ్రమలను పరిశీలిస్తే... హిందీ పరిశ్రమకు చెందిన టిక్కెట్లు ఎక్కువగా బుక్ మై షో ద్వారా అమ్ముడయ్యాయట. తర్వాత స్థానంలో తెలుగు, ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళం సినిమాల టికెట్ల అమ్మకాల్లో బాగా గ్రోత్ కనిపించిందట.

ఆశీష్ హేమ్రాజని
బుక్ మై షో సీఈఓ ఆశీష్ హేమ్రాజని మాట్లాడుతూ...2018లొ సినిమాలు, లైవ్ ఈవెంట్లకు మంచి డిమాండ్ ఏర్పడిందని, 2.0, పద్మావత్, సంజు చిత్రాలకు ప్రేక్షకులను బాగా ఎంటర్టెన్ చేశాయని తెలిపారు.


Click it and Unblock the Notifications











