Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'బోరింగ్ పాప' రూటు మార్చింది
బోరింగ్ పాపగా పాపులర్ అయిన జయలలిత ఆ తర్వాత అన్నీ అట్లాంటి పాత్రలే చేస్తూ వచ్చింది. శాస్త్రీయ నృత్యం నేర్చుకుని పరిశ్రమలోకి కాలు పెట్టిన ఆమె కమల్ హాసన్ 'ఇంద్రుడు-చంద్రుడు' సినిమాలో చరణ్ రాజ్ భార్యగా, వంశి ఏప్రియల్ పస్ట్ విడుదల చిత్రంలో భాగ్యంగా అక్రమ సంభందాలు పెట్టుకునే పాత్రలుతో పాపులర్ అయింది. అయితే తాజాగా వంశి గోపి..గోపిక..గోదావరి చిత్రంలో మాత్రం హీరోయిన్ తల్లి పాత్ర వేసి రూటు మార్చింది. తనలాగే తన కూతరు మోసపోకూడదని జాగ్రత్తలు తీసుకునే ఈ సీరియస్ పాత్ర ఆమెకు పేరు తెస్తుందని ఆశించింది. అయితే సినిమా అనుకున్నంత వర్కవుట్ కాకపోవటంతో ఇప్పుడు ఆలోచనలో పడింది అంటున్నారు. అయితే ధియోటర్స్ లో మాత్రం ఆమె ఎంత మేకప్ చేసి పవిత్రమైన డైలాగులు చెప్పిననా ఆ దృష్టితోనే చూడటం వల్ల రెస్పాన్స్ మరో విధంగా ఉంది. ఒక గాఢమైన ముద్ర పడిన తర్వాత ఎంత ఛేంజ్ చేసినా మార్చటం చాలా కష్టమనే అంటున్నారు. అయితే ఈ మధ్యన నచ్చావులే చిత్రంలో హీరో తల్లిగా ఒకప్పటి ఐటం గర్ల్ (ప్రేమ లేఖ చిన్నదానా..ఓ చిన్నదానా పాట ఫేమ్) బాగా క్లిక్ అయింది. అలాగే జయలలిత కూడా క్లిక్ అవుతుందని అంతా ఆశించారు. కానీ కంటిన్యూగా తెరపై ఆ పాత్రలు ఇప్పటివరకూ చేయటం ఆమెకు మైనస్ అయ్యిందని చెప్తున్నారు. అయినా బోరింగ్ పాప ఇమేజే బాగున్నప్పుడు, నాలుగు వేషాలు తెచ్చిపెడుతున్నప్పుడు ఎందుకు ప్రయోగాలు చేసి పళ్ళు రాలకొట్టుకోవటం అనే వారు ఉన్నారు.