బాస్‌ తొలికాపీ, 23న సెన్సార్‌

By Staff

స్టాలిన్‌ చిత్రం విడుదల కావడంతో ఇక అందరి దృష్టి ఇప్పుడు బాస్‌ మీదనే ఉంది. నాగార్జున హీరోగా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ బాస్‌ - ఐ లవ్‌ యూ చిత్రం తొలికాపీ సిద్ధమైంది. గురువారం అర్ధరాత్రి ఈ చిత్ర దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య, కెమెరామెన్‌ శివకుమార్‌, మరికొందరు యూనిట్‌ సభ్యులు ప్రివ్యూ చూశారు. బాస్‌ చిత్రం ఈనెల 23న సెన్సార్‌ పూర్తి చేసుకోని 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.

అయితే, బాస్‌ చిత్రం 300 ప్రింట్లతో విడుదలవుతున్నట్టు కొన్ని వెబ్‌సైట్లు పేర్కొన్నా అది వాస్తవం కాదని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రింట్‌ ఆర్డర్లు ఇప్పటివరకూ 225 వరకూ ఉన్నాయని, మరో పాతిక జత కావచ్చని అంటున్నారు. ల్యాబ్‌ వర్గాల తొలి నివేదికల బట్టి బాస్‌ చిత్రం నాగార్జున ఖాతాలో మరో సూపర్‌ హిట్‌గా నిలుస్తుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం అవుట్‌పుట్‌పై నిర్మాత డి. శివప్రసాదరెడ్డి కూడా సంతృప్తికరంగా ఉన్నారు.

కామాక్షి మూవీస్‌ పతాకంపై ఇప్పటివరకు నాగార్జునతో నిర్మించిన చిత్రాలన్నీ ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నాయి. తాజా చిత్రం బాస్‌ - ఐ లవ్‌ యు లో కూడా ప్రేక్షకులను రంజింప చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా మా హీరోతో మరో మంచి చిత్రాన్ని రూపొందించే అవకాశం లభించినందుకు ఆనందంగా ఉంది అని కామాక్షి మూవీస్‌ అధినేత శివప్రసాద్‌ రెడ్డి అన్నారు.

నాగార్జున నిజజీవితంలో ఒకపక్క నటనలో అగ్రస్థానంలో కొనసాగుతునే మరోవంక స్టూడియో కార్యకలాపాలు కూడా పర్యవేక్షిస్తున్నారు. స్టూడియోలోనూ, నిర్మాతగా ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వారందరికీ ఆయన బాస్‌. నిజజీవితంలో బాస్‌గా ఆయన వ్యవహారదక్షత ఎంత సమర్థంగా ఉంటుందో ఈ చిత్రంలో కూడా బాస్‌గా నాగార్జున అందరి చేత ఐ లవ్‌ యూ అని చెప్పించుకునే విధంగా కనిపిస్తారని దర్శకుడు వి.ఎన్‌. ఆదిత్య అంటున్నారు.

బాస్‌గా నాగార్జునది ఎంతటి స్ట్రాంగ్‌ క్యారక్టరైజేషనో, సెక్రటరీగా నయనతారది కూడా అంతే గట్టి క్యారెక్టర్‌ అనీ, వారిద్దరి మధ్యా సాగే కెమిస్ట్రీ ఈ చిత్రంలో ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు చెబుతున్నారు. బాస్‌ చిత్రానికి కళ్యాణి మాలిక్‌ సమకూర్చిన సంగీతం అందరినీ అలరిస్తోందని, మార్కెట్‌లో ఆడియోకు విశేషాదరణ లభిస్తోందని ఆయన తెలిపారు.

మరిన్నికథనాలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X