అల్లు అర్జున్ బయటకు రావాలి!

"అల్లు అరవింద్ తెలివైనవాడు. అందుకే కొడుకు అర్జున్‌ను బయటికి రానివ్వట్లేదు. అర్జున్ బయటకు రాకపోతే చిరంజీవి కుటుంబంలో (ఇంట్లో) గొడవలైపోతాయ్! మేం రోడ్డుమీద పడితే... మీరు సినిమాల్లో నటిస్తారా? అనే ప్రశ్న పవన్‌కళ్యాణ్ నుంచి వస్తుంది'' అని బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం సచివాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ... "మేం (బొత్స కుటుంబసభ్యులు) ఏడుగురం. ఎన్నికలొస్తే ఒక్కొక్కరం ఒక్కో నియోజకవర్గం చొప్పున ఏడుచోట్లకు వెళ్లిపోతాం. అందర్నీ కలుపుకొని ముందుకెళ్తాం.
కానీ టీడీపీ, పీఆర్పీలలో అలా కాదు. చిరంజీవి పక్కన బామ్మర్ది అరవింద్, తమ్ముడు పవన్‌కళ్యాణ్ చేరాడు. చంద్రబాబు పక్కన బామ్మర్దులు హరికృష్ణ, బాలకృష్ణ, అల్లుళ్లు తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రాం చేరారు. ఈ రెండు పార్టీలు బంధు బృందాలుగానే కనిపిస్తున్నాయి'' అని ఎద్దేవా చేశారు.ఇదంతా చూస్తుంటే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కూడా పార్టీ కోసం పనిచేయాలని అనేటట్లు ఉన్నారని అంతా అంటున్నారు.


Click it and Unblock the Notifications











