భారతీయ తారల్లో నటి నర్గీస్ తర్వాత ఆ స్థానాన్ని ఇలియానా, జెనీలియా దక్కించుకొన్నారు...
మీకో విషయం తెలుసా? దక్షిణాది వెండితెరపై తమ అందచందాలతో, అభినయంతో ఆకట్టుకుంటున్న ఇలియానా, జెనీలియా బ్రెజిల్, మెక్సికోలాంటి విదేశాల్లో చాలా ఫేమస్ అట. ఇంతకీ వీళ్లిద్దరితో సదరు విదేశీయులకు పరిచయం కూడా లేదు. కానీ ఈ సుందరీమణులంటే వారికెంతో అభిమానం. దానికి కారణం ఈ ముద్దుగుమ్మల ఇంటి పేరు అయిన 'డిసౌజా". పోర్చుగీస్ లో ప్రసిద్ధి పొందిన సర్ నేమ్స్ లో 'డిసౌజా" ఒకటి. ఇంటర్ నెట్‌లో ఇలియానా డిసౌజా, జెనీలియా డిసౌజా అని బ్రెజిల్, మెక్సికన్లు చూసి, ఈ ఇద్దరూ తమ అమ్మాయిలే అని భావించారట.
దాంతో వీళ్ల ఫొటోలను డౌన్ లోడ్ చేసుకుంటున్నారని సమాచారం. బ్రెజిల్, మెక్సికో నగరాల్లో గల పలు హోటల్స్ లో మన ఇలియానా, జెనీలియాలు చిరునవ్వులు చిందించే ఫొటోలు ఉన్నాయట. ఇంకో విషయం ఏంటంటే.. హాలీవుడ్ తారలు పెనిలోప్ క్రూజ్, జెన్నిఫర్ లోపెజ్ ల ఫొటోల పక్కన ఈ ఇద్దరి ఫొటోలు ఉన్నాయని సమాచారం. ఇలియానా, జెనీలియా ప్రొఫైల్ గురించి బ్రెజిల్, మెక్సికన్లకు తెలియకపోయినా.. వారికి అక్కడ చాలా క్రేజ్ ఉందని ఓ అమెరికన్ న్యూస్ చానల్ ఆ మధ్య ఒక వార్త కూడా ప్రసారం చేసింది.
కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి అరుదైన అవకాశం భారతీయ తారల్లో నటి నర్గీస్ కు దక్కింది. యూరప్, టర్కీల్లో గల హోటల్స్ లో నర్గీస్ ఫొటోలు దర్శనమిచ్చేవట. తాజాగా ఆ స్థానాన్ని ఇలియానా, జెనీలియా దక్కించుకోగలిగారు. ఒకవేళ ఈ సుందరీమణులు తమ పేరుకి ఇంటి పేరు తగిలించుకోకపోయి ఉంటే విదేశీయులకు ఇంతగా దగ్గరయ్యేవారు కాదని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











