twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ కి బోత్సా అభయహస్తం..!

    By Sindhu
    |

    పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'తీన్ మార్" సినిమాకి నిర్మాత ఎవరు?ఇంకెవరు..నిన్నమొన్నటిదాకా కమెడియన్ గా తెలుగు సినిమాల్లో నటించి, 'ఆంజేనేయులు"సినిమాలతో నిర్మాతగా మారిన గణేష్ అలియాస్ గణేష్ బాబు. పైకి గణేష్ బాబు నిర్మాత అయినా, తెరవెనుక కష్టమంతా మంత్రి సత్తిబాబు అలియాస్ బోత్సా సత్యనారాయణగారిదేనని పరోక్షంగా 'తీన్ మార్" ఆడియో విడుదల వేడుకలోనే స్పష్టమయిపోయింది గణేష్ మాటల ద్వారా. ఇప్పుడిదంతా ఎందుకంటే 'తీన్ మార్" సినిమా టైటిల్ విషయమై తెలంగాణలో 'లొల్లి" జరుగుతోంది. ఈ లొల్లి జస్ట్ పబ్లిసిటి డ్రామాగా చాలామంది అభివర్ణిస్తున్నారు. 'తీన్ మార్"సినిమాకి ఎలాంటి అడ్డంకులూ వుండరాదని, బొత్సా ఆల్రెడీ టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ ని కోరడం, కేసిఆర్ నుంచి ఈ మేరకు సానుకూల స్పందన రావడం జరిగిపోయాయట.

    వాస్తవానికి పవన్ హీరోగా వచ్చిన 'కొమరం పులి" సినిమా టైమ్ లో తలెత్తిన టైటిల్ వివాదంతో పోల్చితే ఇప్పుడు జరుగుతున్నది జస్ట్ తూతూమంత్రం గొడవగానే లెక్కేయొచ్చు. తీన్ మార్ ఆడియో విడుదలకు బోతసాని తీసుకురావడం ద్వారా తెలంగాణ టెన్షన్ ని నిర్మాత గణేష్ బాబు తప్పించుకున్నాడనే ప్రచారం జరుగుతోంది సినీ పరిశ్రమలో. కాగా ఆడియో పర్లేదు" అన్న టాక్ రావడంతో ఇలా ఈ నెగెటివ్ పబ్లిసిటీతో తెలంగాణలో హైప్ క్రియేట్ చేయిస్తున్నాడు గణేష్. అంటూ వస్తోన్న గాసిప్స్ లో నిజమెంతోగానీ, 'తీన్ మార్" సినిమాకి తెలంగాణలో పబ్లిసిటీ బాగానే దక్కుతోంది వరంగల్ రవి వివాదం కారణంగా..

    English summary
    The producer of the film, Ganesh thanked Pawan Kalyan, Jayant, Mani Sharma, Trivikram Srinivas and Botsa Satyanarayana for being a pillar of strength for him throughout the film’s production.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X