»   » డమ్మీగాడు..కరివేపాకు లాంటి వాడని అంటున్నా చలించలేదు

డమ్మీగాడు..కరివేపాకు లాంటి వాడని అంటున్నా చలించలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లోకి ఓ సాధారణ కమేడియన్ గా ఎంటరయి ఆ తర్వాత కనుమరుగయిపోయి ఏకంగా రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీస్తానని సంచలనం సృష్టించిన నటుడు, నిర్మాత గణేష్. పరమేశ్వరీ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పెద్ద హీరోలతో అందులోనూ భారీ బడ్జెట్ సినిమాలు తీసేస్తున్నాడు ఏ టెన్షనూ లేకుండా. ఇంతకీ ఆయనకు ఈ దైర్యం, డబ్బు ఎక్కడి నుండీ వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆ తర్వత మంత్రి బొత్స సత్యనారాయణ ఆంజనేయులు సినిమాను నిలబెట్టడానికి తెగ హడావిడి చెయ్యడంతో ఆయనే ఈ సినిమాను పొడ్యూజ్ చేసి గణేష్ ను డమ్మీలాగా వాడుకుంటున్నాడనే వార్తలు వచ్చాయి.

ఇక వీటికి తోడు గణేష్ పవన్ తో సినిమా మొదలెట్టడం, అంతుకు ముందే మీడియాతో బొత్స తాను పవన్ తో సినిమాలని అనుకుంటున్నట్టు ప్రకటించడం, ఈ కొత్త సినిమా ప్రారంభ కార్యక్రమాన్ని బొత్స సతీసమేతంగా సొంత సినిమాకు చేసినట్టు హడావిడి చెయ్యడంతో ఈ సినిమాకు బొత్సే అసలు నిర్మాత అని బహిర్గతం అయిపోయింది. దీంతో గణేష్ డమ్మీ ప్రొడ్యూజర్, కరివేపాకు లాంటి వాడని టాలీవుడ్ లో సెటైర్లు వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గణేష్ అవేవీ పట్టించుకొనే స్థితిలో లేడు. అస్సలు ఈ సెటైర్లను వినీ వినబడనట్టు వ్యవహరిస్తున్నాడు. అంతేలే ఎవరినో(బొత్స) అడ్డుపెట్టుకొని కోట్లు గడించాలని అనుకుంటున్న గణేష్ సిగ్గుశరం లాంటి వాటికి నీళ్లొదిలేయాలి..లేకపోతే ఎలా..ఎదైతేనేమి బొత్స ఈ సినిమా నిర్మాత అని తెలియడంతో సినిమాల్లో కామెడియన్ గా నటించిన గణేష్ నిజంగానే కమేడియన్ అయిపోయాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu