twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    200మంది బౌన్సర్లు, స్థానికులకు ప్రవేశమే లేదు: నయనతార షూటింగ్ కోసం అట్టహాసం

    |

    తాజాగా నయన్‌ శివకార్తికేయన్‌తో 'వేలైక్కారన్‌'లో నటిస్తున్న విషయం తెలిసిందే కదా.. రజనీకాంత్‌ గతంలో నటించిన 'వేలైక్కారన్‌' సినిమా టైటిల్‌ని మళ్ళీ ఈ సినిమాకి పెట్తారు. అసలు విషయం అది. ఇదిలా ఉంటే.. ఇటీవల 'తని ఒరువన్‌' వంటి సూపర్‌ హిట్‌ మూవీకి దర్శకత్వం వహించిన మోహన్‌ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

     శివ కార్తికేయన్

    శివ కార్తికేయన్

    మురికివాడలకు చెందిన ఓ యువకుడి కథతో ఈ చిత్రం ఉంటుందట. ఇప్పటికైతే ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు నిర్మాణ విలువల్లో ఎక్కడా తగ్గటం లేదు కూడా... పైగా యువ హీరో అయిన శివ కార్తికేయన్ తో నయన్ నటించటం కూడా ఇక్కడ పెద్ద విశేషంగానే చెప్పుకుంటున్నారు.

    వేలైక్కారన్

    వేలైక్కారన్

    నయనతార ఈ మధ్య సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ పోతుంది. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు పెట్టేస్తూనే .. మరో వైపు కుర్ర హీరోల సినిమాలను వదలడం లేదు. ప్రస్తుతం "బాలయ్య 102", మెగాస్టార్ "సైరా నరసింహ రెడ్డి" సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ భామ తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి "వేలైక్కారన్".

    200 మంది బౌన్సర్లు

    200 మంది బౌన్సర్లు

    రాజస్థాన్‌లోని కిషన్‌ఘడ్‌కు చెందిన మార్బల్ ఏరియాలో గల డంపింగ్ యార్డ్ షూటింగ్‌లకు పేరొందింది. ఇక్కడ జరిగిన వేలైక్కారన్‌ లోని సాంగ్ షూటింగ్ చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతంలో షూటింగ్ కోసం మంచు కురుస్తున్నట్టు కనిపించేలా ఒక పెద్ద సెట్ వేశారు. సాధారణ ప్రజలెవరూ ఇక్కడికి రాకుండా ఉండేలా చిత్ర యూనిట్ రక్షణ కోసం 200 మంది బౌన్సర్లను కాపలాగా ఉంచింది.

     కాశ్మీర్‌లో

    కాశ్మీర్‌లో

    దీనికితోడు స్థానికంగా ఉన్న సెక్యూరిటీ సహాయం కూడా తీసుకున్నారు. ఈ పాట షూటింగ్ కోసం దేశంలోని పలు ప్రాంతాలను యూనిట్ సందర్శించింది. అయితే కాశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ షూటింగ్ చేయలేకపోయారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు, వేడి, చలి వాతావరణాల కారణంగా షూటింగ్ కుదరలేదు. దీంతో ఈ పాటకు కిషన్‌ఘడ్ తగిన ప్రాంతమని భావించి ఇక్కడ షూటింగ్ చేశారు.

    English summary
    The shooting of the movie Velaikkaran is currently in progress Apparently it seems there is a team of bouncers has been deployed on the set and they are restricting entry to almost none except those who are permitted by the producer himself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X