OG Vs Akhanda 2: హిందూపూర్ ఎమ్మెల్యే Vs పిఠాపురం ఎమ్మెల్యే బాక్సాఫీస్ ఫైట్! గెలుపెవ్వరిది?

తెలుగు సినిమా పరిశ్రమలో 2025 సంవత్సరంలో దసరా పండగ బాక్సాఫీస్‌ను భీకరంగా మార్చబోతున్నది. ఇప్పటికే చాలా సినిమాలు ఈ పండగ బరిలోకి దూకేందుకు సిద్దమవుతుండగా.. ఈ పోటీలో ప్రధానంగా OG, అఖండ సినిమాలు నిలవడం ఆసక్తికరంగా మారాయి. అయితే గతంలో ఇలాంటి పోటీ పలుమార్లు కనిపించినా.. ఈ సారి మాత్రం సరికొత్తగా ఫ్యాన్స్‌ను చొక్కాలు చించుకొనేలా చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ దసరాకు బాక్సాఫీస్ పోటీ ఎలా ఉండబోతుందనే వివరాల్లోకి వెళితే..

2025 దసరా పండగ రసత్తరంగా
తెలుగు సినిమా ప్రేక్షకులకు 2025 సంవత్సరం రసవత్తరంగా మారబోతున్నది. అందుకు కారణం పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాతో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2: తాండవం చిత్రం ఒకే రోజున అంటే సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. అయితే ముందుగా ఓజీ సినిమా డేట్‌ను డీవీవీ దానయ్య ప్రకటించగా.. తాజాగా అదే రోజు అఖండ నిర్మాతలు తమ సినిమాను విజయదశమి కానుకగా అందిస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.

Akhanda 2 Vs OG

మెగా వర్సెస్ నందమూరి బాక్సాఫీస్ వార్
దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి, మెగా ఫ్యాన్స్ మధ్య వార్ గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. కొన్నిసార్లు చిరంజీవి పై చేయి సాధించగా.. మరికొన్ని సార్లు బాలకృష్ణ అధిక్యం ప్రదర్శించారు. అయితే హిట్టు, ఫ్లాప్ అనే తేడా లేకుండా కలెక్షన్ల పరంగా మెగాస్టార్ తన సత్తాను చాటుకొన్నారు. బాక్సాఫీస్ విషయంలో మెగాను ఇప్పటి వరకు కొట్టిన దాఖలాలు లేకపోవడం ఓ రికార్డు.

తొలిసారి బాలయ్యతో పవన్ కల్యాణ్
అయితే ఇప్పటి వరకు చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే బరిలో ఉండగా.. తాజాగా ఈ పోటీ పవన్ కల్యాణ్, బాలకృష్ణ మధ్య ఏర్పడింది. ఇలా పవర్ స్టార్, నటసింహం పోటీ పడటం ఈ మధ్యకాలంలో దాదాపు మొదటిసారి అనే చెప్పుకోవాలి. అయితే ఈ రెండు సినిమాలు మంచి హైప్‌తో రావడం ఫ్యాన్స్ ఎవరి విజయంపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

హిందూపురం ఎమ్మెల్యే VS పిఠాపురం ఎమ్మెల్యే
ఇక బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల పోటీ రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకొనేలా చేసింది. అఖండ 2 సినిమా డేట్ ప్రకటించగానే.. సోషల్ మీడియాలో హిందూపురం ఎమ్మెల్యే వర్సెస్ పిఠాపురం ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దాంతో ఈ పోటీకి ఈ అంశం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. ఈ పోటీలో బాక్సాఫీస్ విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.

ఆచంట వర్సెస్ డీవీవీ దానయ్య
ఘన విజయం సాధించిన అఖండ సినిమాకు సీక్వెల్‌గా బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో అఖండ 2: తాండవం సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాత రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాకు సుజిత్ దర్శకుడు కాగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X