సాయి వర్సెస్ వరుణ్: కాక రేపుతోన్న మెగా ఫైట్.., చెర్రీ ఎందుకలా అనేశాడు?
Recommended Video

చూడబోతే.. టాలీవుడ్‌లో ఇదేదో మెగా సంవత్సరం లాగే కనిపిస్తోంది. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ నుంచి ముందుగా వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఆ తర్వాత చెర్రీ, బన్నీ 'రంగస్థలం', 'నా పేరు సూర్య'లతో రాబోతున్నారు. ఈ ఒక్క నెలలోనే మెగా ఫ్యామిలీ నుంచి వెంట వెంటనే రెండు సినిమాలు రాబోతున్నాయి. దీంతో ఈ మెగా కాంపిటీషన్‌పై అటు మెగా కుటుంబంలోనూ.. ఇటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.

రాంచరణ్ ప్రమోషన్..:
సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్', వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' సినిమాల కోసం మెగా కుటుంబం బాగానే చొరవ తీసుకుంటోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యేందుకు తమవంతు ప్రమోషన్ బాగానే చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాంచరణ్ సైతం సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు.

'ఇంటిలిజెంట్'పై చెర్రీ:
ఇంటిలిజెంట్' టీజర్‌ను షేర్ చేసిన రాంచరణ్.. 'వివి వినాయక్ గారి మ్యాజిక్ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. నేను పక్కాగా చెప్పగలను నా సోదరుడు సాయి కెరీర్‌లో ఇదో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్' అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

చెర్రీ అలా అనేశాడేంటి?:
సాయిధరమ్ సినిమా కోసం రాంచరణ్ ప్రమోషన్ చేయడం బాగానే ఉంది కానీ.. ఆయన పోస్టులో ఎక్కడో తేడా కొడుతోంది అంటున్నారు అభిమానులు. నిజానికి సాయిధరమ్ తేజ్ రాంచరణ్‌కు బావ వరుస అవుతాడు కానీ ఆయన మాత్రం 'బ్రదర్' అంటూ సంబోధించడం అభిమానులకు ఆశ్చర్యం కలిగింది. అయితే ఇందులో ఆశ్చర్యం కలిగించడానికేముంది?.. 'బ్రదర్' అనే పదం క్యాజువల్‌గా అందరూ వాడే కదా.. అందుకే చెర్రీ కూడా అదే ఫాలో అయ్యాడంటున్నారు మరికొంతమంది.

'తొలిప్రేమ'పై కూడా:
ఇక వరుణ్ తేజ్ 'తొలిప్రేమ'పై కూడా స్పందించిన రాంచరణ్.. ' అద్భుతమైన విజువల్స్.. ప్రతీ సీన్ ఫ్రెష్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా అంచనాలను నిలబెట్టుకోవడమే కాదు.. వరుణ్ అన్న కెరీర్ లో మైల్ స్టోన్‌గా నిలిచిపోతుందని చెర్రీ ట్వీట్ చేశారు.

వరుణ్ అన్నయ్యా?..:
'ఇంటిలిజెంట్'పై పెట్టిన పోస్టులో ఎక్కడో తేడా కొట్టినట్టే.. 'తొలిప్రేమ'పై పెట్టిన పోస్టులోనూ తేడా కొట్టేసింది. నిజానికి వరుణ్ తేజ్ రాంచరణ్‌కు తమ్ముడు.. కానీ ఆయన మాత్రం అన్నయ్యా అంటూ సంబోధించేశారు. అయితే ఇక్కడ కూడా చెర్రీ ఏదో సరదాగా అలా సంబోధించాడని, బహుశా తన కన్నా హైట్ ఎక్కువ కాబట్టి అలా పిలిచాడేమోనని అంటున్నారు.

వరుణ్ వర్సెస్ సాయిధరమ్ తేజ్:
నిక్కచ్చిగా మాట్లాడుకోవాలంటే సాయిధరమ్ తేజ్ 'ఇంటిలిజెంట్' కంటే వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' పైనే అందరి చూపు నిలిచింది. ఇంటిలిజెంట్ ప్రచార చిత్రాలు చూస్తుంటే.. రొటీన్ మాస్ మసాల లాగా ఉందన్న అభిప్రాయాలు ఫ్యాన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో తొలిప్రేమ మాత్రం ఫ్రెష్‌గా కనిపిస్తుందన్న టాక్ బాగా వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి 9, 10తేదీల్లో రాబోతున్నాయి. చూడాలి మరి ఫైనల్‌గా ఈ ఇద్దరు మెగా హీరోల్లో విజేత ఎవరో!


Click it and Unblock the Notifications











