Don't Miss!
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రాంచరణ్ సినిమాతో పోలిక.. దుల్కర్ సల్మాన్ పై ఒత్తిడి!
సౌత్ హీరోలకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎప్పటికి కలగానే ఉంటుంది. స్థానిక చిత్ర పరిశ్రమల కంటే బాలీవుడ్ పరిధి ఎక్కువ కావడంతో ప్రతి హీరో బాలీవుడ్ లో నటించాలని కలలు కంటారు. కానీ సౌత్ నుంచి వెళ్లిన హీరోలు బాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. గత రికార్డులే ఈ విషయాన్ని చెబుతున్నాయి. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం కార్వాన్ ఆగష్టు 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దుల్కర్ సక్సెస్ కాగలడా లేదా అనే ఉత్కంఠ నెలకొనివుంది.
సౌత్ యువ హీరోలు
సౌత్ యువ హీరోలు రాంచరణ్, రానా, ధనుష్ బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే. ఇప్పుడు ఆ జాబితాలోకి దుల్కర్ చేరబోతున్నాడు. కానీ సౌత్ హీరోలకు ఎక్కువగా బాలీవుడ్లో చేదు అనుభవం ఎదురవుతూనే వచ్చింది.
ధనుష్ ఒక్కడే
ఇటీవల కాలంలో సౌత్ నుంచి బాలీవుడ్ లో నటించి సక్సెస్ అయిన హీరో ధనుష్ మాత్రమే అని చెప్పొచ్చు. ధనుష్ బాలీవుడ్ లో నటించిన తొలి చిత్రం రాంజాన. సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 60 కోట్ల వరకు వసూలు చేసి బిగ్ హిట్ గా నిలిచింది.
రాంచరణ్ విఫలయత్నం
ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన జంజీర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అమితాబ్ బ్లాక్ బస్టర్ మూవీ జంజీర్ కు ఇది రీమేక్. రాంచరణ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ అనే విషయం తప్ప గుర్తుంచుకోదగ్గ అంశం మరొకటి లేదు.
నటుడిగా
ఇక దగ్గుబాటి రానా కూడా క్రమంగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడు. రానా నటించిన తొలి బాలీవుడ్ చిత్రం ధమ్ మారో ధమ్ చిత్రం కూడా అంతగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ కూడా నటించాడు.
దుల్కర్‌పై ఒత్తిడి
సౌత్ హీరోలకు అంతగా కలసిరాని బాలీవుడ్ లో దుల్కర్ నటిస్తున్న తొలి చిత్రం విడుదల కాబోతోంది. రాంచరణ్, రానా, ధనుష్ బాలీవుడ్ లో సౌత్ హీరోల చిత్రాల గురించి చర్చించుకుంటే దుల్కర్ పై సహజంగా ఒత్తిడి ఉంటుంది. మంచి కథతో మెప్పిస్తే దుల్కర్‌కు బాలీవుడ్లో కూడా మార్కెట్ ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.