బోయ్ ప్రెండ్ తో ఇలియానా మజా..ఇలా (ఫొటో)

By Srikanya

ముంబై : ఇన్నాళ్లూ గుట్టుగా ఉంచిన బోయ్ ప్రెండ్ వ్యవహారాన్ని రట్టు చేస్తోంది ఇలియానా. ఆమె తన బోయ్ ప్రెండ్ ఆండ్రూ తో తన పుట్టిన రోజుని గడిపింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ సాక్షిగా తన అభిమానులకు తెలియచేసింది. అంతేకాదు తన బోయ్ ప్రెండ్ తీసిన ఫొటోని సైతం షేర్ చేసింది. మీరు చూస్తున్న ఫొటో అదే.

గోవా సుందరి ఇలియానా గతకొంత కాలంగా ఆస్ట్రేలియన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రూ నీబోన్‌తో లవ్‌ఎఫైర్‌ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 'హ్యాపీ ఎండింగ్' సినిమాలో ఆమెతో పాటు ఆండ్రూ కూడా నటిస్తున్నాడట. రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈ సినిమా షూటింగ్ లాస్‌ ఏంజిల్స్‌లో జరుగుతూ ఉండగా ఆండ్రూ తరచూ షూటింగ్ స్పాట్ కు వస్తూ ఉండేవాడట. ఇలియానా బాయ్ ఫ్రెండ్ కావడంతో యూనిట్ సభ్యులకు దగ్గరయ్యాడు. అదే సమయంలో సినిమాలోని ఓ పాత్రకు విదేశీ నటుడు అవవసరం కావడం...ఆండ్రూ అందుకు సరిపోయే విధంగా ఉండటంతో అతన్నే తీసుకున్నారట.

ఆండ్రూ ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్. ఇలియానా-ఆండ్రూ మధ్య దాదాపు రెండేళ్లుగా పరిచయం ఉంది. రెండేళ్ల క్రితం క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ బాగా పెరిగిందని, ఇరువురు ఒకరి అభిప్రాయాల ఒకరు బాగా తెలుసుకోవడంతో పాటు అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు. అంతే కాదండోయ్...ఆ మధ్య ఒకసారి ఇలియానా అతన్ని తన ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేసి తన పేరెంట్స్‌కి పరిచయం కూడా చేసిందట.

ఇలియానా మాట్లాడుతా...'హ్యాపీ ఎండింగ్‌' చిత్రంలో అంచల్‌ అనే ఓ రచయిత్రి పాత్ర పోషిస్తున్నాను. నేను ఈ చిత్రంలో ఓ రొమాంటిక్‌ నవల రాస్తున్న మాట వాస్తవమే కానీ నా పాత్ర మాత్రం రొమాంటిక్‌గా ఉండదు. కానీ నిజ జీవితంలో నేను రొమాంటిక్‌గానే ఉంటాను. ఈ నవల్లో హీరో ఆరడగులు అందగాడు కావాలని కోరుకుంటాను. నిజ జీవితంలో నాకు అలాంటి నియమాలేమీ లేవు.

Boy Friend Captures Ileana & Said I Love You!

అలాగే... ''ఇతరులపై ఆధారపడి జీవించడం అంటే నాకు పరమ చిరాకు. నా సంపాదనతో జీవించడంలో ఉన్న ఆనందం ఎందులోనూ ఉండదు. నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నేనే తీసుకొంటాను. మనం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నామంటే జీవితంలో అభివృద్ధి దిశగా వెళుతున్నట్టే'' అని చెప్పుకొచ్చింది.

ఇక ''దక్షిణాదిలో నేను హీరోయిన్ గా నిలదొక్కుకోవడం ఆషామాషీగా జరగలేదు. ఎందుకంటే నాకు గోవా తప్పితే వేరే లోకం తెలియదు. ఇక్కడ సంప్రదాయాలు, భాషలు అన్నీ కొత్తే. కానీ కష్టపడ్డాను. ఆనందంగా దక్షిణాది చిత్రాల్లో నటించాను. దక్షిణాది, బాలీవుడ్‌ రెండింటిలోనూ పెద్దగా తేడా ఏమీలేదు. కానీ దక్షిణాదిలో పరిస్థితి ఎలా ఉంటుందంటే సెట్‌కు వెళ్లామా మన పాత్ర ఏంటో చేశామా ఇంటికొచ్చామా..అనేలా ఉంటుంది. బాలీవుడ్‌లో నటించడంతోనే అయిపోదు. అంతకుమించిన బాధ్యత ఉంటుంది'' అని చెప్పుకొచ్చింది.

అంతేకాదు...''ఇల్లు చిందరవందరగా ఉంటే కోపం వచ్చేస్తుంది. వంటగదిలో ఉండాల్సినవి ఒకచోట ఉండకపోతే కూడా నాకు నిద్రపట్టదు. ఇంట్లోని ప్రతి వస్తువు శుభ్రంగా ఉండి తీరాల్సిందే. ఓ గృహిణిలా ఇల్లు సర్దుకుంటాను. విదేశాల్లో ఎప్పుడు షాపింగ్‌ చేసినా బట్టలు, బూట్లు కంటే వంటగది సామాన్లే ఎక్కువగా కొంటాను అని చెప్పుకొచ్చింది.

కొద్ది రోజుల క్రితం శృగారం గురించి కూడా ఆమె పెదవి విప్పింది. గోవా బ్యూటీ ఇలియానా మాత్రం పబ్లిగ్గానే శృంగారం గురించి తెగ లెక్చరర్స్ ఇస్తోంది. సిగ్గు, మొహమాటం లాంటివేవీ లేకుండా సెక్స్ మనిషికి చాలా అవసరం అని చెప్పిందట ఇల్లీ. ఇటీవలే ఓ హెల్త్ మేగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇలియానా సెక్స్ గురించి చాలా విషయాలే చెప్పినట్లు తెలుస్తోంది.

ఆమె మాట్లాడుతూ...మంచి హెల్త్‌కి సెక్స్ చాలా అవసరం. సెక్స్ వల్ల ఫిట్‌గా వుంటారు. అంతేకాకుండా మంచి ఆకృతితోపాటు ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పిందట. శృంగారం వల్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్ బాగుంటాయని గతంలో చాలామందే చెప్పారు కానీ ఈ ఉత్సాహం గురించి చెప్పినవాళ్లు మాత్రం తక్కువే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X