తొలిప్రేమ స్ఫూర్తితో...(బాయ్ మీట్స్ గర్ల్ ప్రివ్యూ)
హైదరాబాద్: ఓ సూపర్ హిట్ చిత్రం స్పూర్తితో మరో చిత్రం రెడీ అవుతే ఎలా ఉంటుంది...పవన్ కళ్యణ్ సూపర్ హిట్స్ లో తొలి ప్రేమ చిత్రం ఒకటి. అప్పటి యూత్ ని విపరీతంగా అలరించిన ఆ చిత్రం సారం తీసుకుని రాసిన ఓ కథ సినిమాగా మారి అలరించటానకి ఈ రోజు సిద్దమైంది.
సిద్ధు (సిద్ధు) ఓ యానిమేటర్. సరదా కుర్రాడు. చదువుకునే రోజుల్లో మహాలక్ష్మిని (కనికా తివారీ) చూసి ఇష్టపడతాడు. కానీ అప్పుడు ఆ విషయం చెప్పలేకపోతాడు. కొన్నాళ్లకు ఆమెను ఎలాగైనా కలుసుకొని మనసులో మాట చెప్పాలని ఆమెను వెతుక్కొంటూ వెళతాడు. మరి ఆమెను కలిశాడా? ప్రేమను సాధించాడా? అనేదే చిత్ర కథ.

''ప్రతి ఒక్కరి జీవితంలోనూ తొలిప్రేమ ఉంటుంది. కానీ ఆ సమయంలో మనసుపడ్డ వారికి విషయం చెప్పలేక ఆ తర్వాత మథనపడుతుంటారు. మనసుపడ్డ అమ్మాయి పేరు వినిపిస్తేనో, ఏదైనా నేమ్ బోర్డుపై ఆమె పేరు కనిపిస్తేనో మనసులో ఏదో కలవరం రేగుతుంటుంది. ఆ అమ్మాయినే గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంటారు. ఇది నా జీవితంలోనూ జరిగింది. దానికి 'తొలిప్రేమ' చిత్ర సారాన్ని జోడించి ఈ కథ రాసుకొన్నా. కెమెరా పనితనం, సంగీతం అత్యున్నత స్థాయిలో ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించిన గీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ'' - వసంత్ దయాకర్
చిత్రం: బాయ్ మీట్స్ గర్ల్ తొలి ప్రేమకథ,
సంస్థ: టి 24 సినిమాస్
నటీనటులు: సిద్ధు, కనికా తివారీ, నిఖితా అనిల్, సూర్య, చంటి, ప్రవీణ్, వెన్నెల కిషోర్, మధుమణి, హరీష్, శంకర్ తదితరులు
సంగీతం:గురురాజ,
పాటలు:శ్రీరామ్ తపస్వి,
కెమెరా:దుర్గా కిశోర్,
ఆర్ట్:బ్రహ్మ కడలి,
కథ, మాటలు, పాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:వసంత్ దయాకర్.
నిర్మాత: సునీత
విడుదల: శుక్రవారం


Click it and Unblock the Notifications











