మెగా హీరో సినిమాపై కుల వివాదం.. షూటింగ్ ఆపేశారు
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వాల్మీకి'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా వాల్మీకి రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అనంతపురంలో మూడు రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేయగా ఊహించని షాక్ తగిలింది. యూనిట్ అంతా అనంతపురం షూటింగ్ లొకేషన్‌కు చేరుకున్నాక బోయ కులానికి చెందిన కొంత మంది అక్కడకు వచ్చి షూటింగ్ చేయవద్దని నివారించారు. వాల్మీకి అనేది తమ కులానికి చెందిన వ్యక్తి పేరని, దాన్ని ఉపయోగించుకోవడమే గాక తుపాకీ వంటి ఆయుధాన్ని పట్టుకొని స్టిల్స్ ఇస్తుండటం సరికాదని వారు ఆందోళనకు దిగారు. చిత్ర బృందం ఎంత నచ్చ చెప్పినా ఎవరు వినలేదు సరికదా షూటింగ్ జరగనీయకుండా అడ్డుకున్నారు.

చాల సేపు వాదోపవాదాలు జరిగినా.. గొడవ ఆపకపోయే సరికి షూటింగ్‌ను క్యాన్సిల్ చేసేసింది వాల్మీకి యూనిట్. తదుపరి వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వాల్మీకి సినిమాకు మొదటి నుంచే కొన్ని షాకులు తగులుతున్నాయి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే నటించాల్సి ఉండగా.. మొదట్లోనే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం దేవిశ్రీ విషయంలోనూ అదే ప్రచారం జరుగుతుండటం మెగా అభిమానులను కలవరపెడుతోంది. అయితే వీటిపై అధికారిక సమాచారాలు వెలువడలేదు.


Click it and Unblock the Notifications











