Boyapati RAPO : మాస్ జాతరకు రంగం సిద్దం.. ఇక రచ్చ రచ్చే!

వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్నాడు రామ్ పోతినేని. గత కొంతకాలం క్రితం వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడిన ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన చేసిన రెడ్ సినిమా మంచి ఫలితాన్ని అందుకోక పోయినా లింగుస్వామి దర్శకత్వంలో ప్రస్తుతం రామ్ ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా కోసం రామ్ తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రామ్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని గతంలోనే అధికారిక ప్రకటన వచ్చింది తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.

Recommended Video

Major Movie Review...Adivi Sesh కెరీర్ బెస్ట్ మూవీ #Tollywood | Filmibeat Telugu

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఓ పాన్ ఇండియా సినిమా ప్రారంభమయింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 9గా శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధ‌వారం హైదరాబాద్ కి ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయ్యింది. దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా కాగా హీరో రామ్ కు 20వ సినిమా. హీరో రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియ‌ర్‌ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ క్లాప్ ఇచ్చారు. ఇక ఈ సన్నివేశానికి బోయపాటి శ్రీను స్వ‌యంగా గౌరవ దర్శకత్వం వహించారు.

 Boyapati and Ram Pothinenis next movie RAPO 20 launched in hyderabad.

ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకులు లింగుస్వామి, వెంకట్ ప్రభు బోయ‌పాటికి స్క్రిప్ట్ అందజేశారు. ఇక ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. 'ది వారియర్' తర్వాత మా హీరో రామ్‌తో వెంటనే మరో సినిమా చేయడం ఆనందంగా ఉందని, మా సంస్థలో ప్రతిష్ఠాత్మక సినిమాగా తెరకెక్కుతోందని అన్నారు. ఇక భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా చేయబోతున్నానామని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం అని శ్రీనివాసా చిట్టూరి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X